తెలంగాణను(Telangana) వరుణుడు వదలడం లేదు... మొన్నటిదాకా వానలతో తడిసి ముద్దైన భాగ్యనగరం.. రెండు, మూడు రోజుల నుంచి ఎండలతో ఠారెత్తిస్తుంది.

Heavy Rains In Hyderabad
తెలంగాణను(Telangana) వరుణుడు వదలడం లేదు... మొన్నటిదాకా వానలతో తడిసి ముద్దైన భాగ్యనగరం.. రెండు, మూడు రోజుల నుంచి ఎండలతో ఠారెత్తిస్తుంది. మళ్లీ హైదరాబాద్ కు వాన గండం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ హెచ్చరికతో జీహెచ్‌ఎంసీ(GHMC) అలెర్ట్ అయింది.. వర్షం సమయంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించింది. అయితే నిన్న రాత్రి నుంచే పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. మలక్‌పేట, చాదర్‌ఘట్, గచ్చిబౌలి, మియాపూర్, మాదాపూర్, కొండాపూర్, బంజారాహిల్స్, కాళీమందిర్(Khalimandhir), సరూర్‌నగర్(Suroornagar), చంపాపేట(Champapet), సన్‌సిటీ(Suncity) తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం కురిశింది.
