గంటకు 30నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం ఒకటి లేదా రెండు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. చాలా చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
తెలంగాణ(Telangana )లో మరోసారి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు పలుచోట్ల వానలు(Rains) పడతాయని పేర్కొంది. మరో మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ కూడా జారీ చేసింది. దీంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ(weather department)పేర్కొంది. ఉమ్మడి వరంగల్, నల్గొండ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పలు చోట్ల తేలికపాటినుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. అయితే సోమవారం ఉరుములు, మెరుపుల(thunderstorm and lighting) తో కూడిన వర్షాలు పడ్తాయని తెలిపింది. ఈ సమయంలో గంటకు 30నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. మంగళవారం ఒకటి లేదా రెండు జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముంది. చాలా చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
అయితే గత కొద్ది రోజుల క్రితం తెలంగాణలోని అనేక జిల్లాలో వర్షాలు కురిశాయి. పంట నష్టం కూడా జరిగింది. ఆ తరువాత మళ్లీ వాతావరణం సాధారణ స్థితికి చేరుకుంది. అయితే మరోవైపు ఇటీవల రాష్ట్రంలో కురిసిన వర్షాలకు రైతన్న తీవ్రంగా నష్టపోయాడు. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల మిర్చి, మొక్కజొన్న, వరి పంటలతో పాటు మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. పంట చేతికొచ్చే సమయంలో వడగండ్లు పడడంతో తీవ్ర నష్టం కలిగిందని రైతులు వాపోతున్నారు. ఇప్పుడు మరోసారి వర్షాలు పడతాయని వాతవరణ శాఖ (weather department)హెచ్చరికలు జారీ చేయడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.