హైదరాబాద్ శివారు ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తుంది. గత రెండు గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది.

హైదరాబాద్(Hyderabad) శివారు ప్రాంతాలలో భారీ వర్షం కురుస్తుంది. గత రెండు గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. రాజేంద్రనగర్(Rajendra Nagar), అత్తాపూర్(Athapur), కాటేదాన్(Katedan), నార్సింగీ(Narsingi), మణికొండ(Manikonda), గండిపేట(Gandipeta), బండ్లగూడ(Bandlaguda) లో వాన దంచి కొడుతుంది. దీంతో రోడ్లు, పలు కాలనీలు జలమయమయ్యాయి. పలు చోట్ల విద్యుత్‌కు అంతరాయం క‌ల‌గ‌డంతో ప్ర‌జ‌లు ఇబ్బందులు పడుతున్నారు. ఉప్పర్ పల్లి 191 పిల్లర్ వద్ద భారీగా వరద నీరు చేరడంతో రోడ్డు క‌నిపించ‌డం లేదు. దీంతో వాహనాలు నిలిచిపోవ‌డంతో భారీ గా ట్రాఫిక్ జామ్ అయ్యింది. శివరాంపల్లి(Shivarampalli) వద్ద కూడా రహదారి చెరువును తలపిస్తుంది. వరద ప్రవాహం రోడ్డుపై నిలవ‌డంతో వాహ‌న‌దారులు ఇబ్బందులు ప‌డుతున్నారు. రాజేంద్రనగర్(Rajendra Nagar), శివరాంపల్లి లో అధిక శాతం వర్షపాతం నమోదు అయిన‌ట్లు తెలుస్తోంది.

Updated On 4 Sep 2023 8:05 PM GMT
Yagnik

Yagnik

Next Story