పాపం ఓ వృద్దుడు వలపు వలలో చిక్కాడు. చిక్కి బంగారు గొలుసు(Gold Chain) పోగొట్టుకున్నాడు. మేడ్చల్‌కు(Medchal) చెందిన 36 ఏళ్ల పసుపులేటి శిరీష(Pasuleti sirisha), ఎన్టీఆర్ నగర్‌కు చెందిన 40 ఏళ్ల ఉన్నీసా బేగం అలియాస్ సమీనా బ్యూటీషియన్లుగా పనిచేస్తున్నారు. దాంతో వచ్చే ఆదాయం వారికి తృప్తినివ్వలేదు. ఈజీగా బోల్డంత డబ్బును సంపాదించడానికి అక్రమ మార్గాలను ఎంచుకున్నారు. వీరి వలలో నాగోలు మత్తుగూడకు చెందిన ఓ వృద్ధుడు(old man) పడ్డాడు.
పాపం ఓ వృద్దుడు వలపు వలలో చిక్కాడు. చిక్కి బంగారు గొలుసు(Gold Chain) పోగొట్టుకున్నాడు. మేడ్చల్‌కు(Medchal) చెందిన 36 ఏళ్ల పసుపులేటి శిరీష(Pasuleti sirisha), ఎన్టీఆర్ నగర్‌కు చెందిన 40 ఏళ్ల ఉన్నీసా బేగం అలియాస్ సమీనా బ్యూటీషియన్లుగా పనిచేస్తున్నారు. దాంతో వచ్చే ఆదాయం వారికి తృప్తినివ్వలేదు. ఈజీగా బోల్డంత డబ్బును సంపాదించడానికి అక్రమ మార్గాలను ఎంచుకున్నారు. వీరి వలలో నాగోలు మత్తుగూడకు చెందిన ఓ వృద్ధుడు(old man) పడ్డాడు. ఆయన మొబైల్ నంబర్ తీసుకుని తరచూ మాట్లాడేవారు. పాపం ఆయన మోహంలో పడిపోయారు. ఆదివారం మత్తుగూడ(Mattuguda) దగ్గరలో ఉన్న తాజ్ హోటల్‌కు వచ్చి వృద్ధుడికి ఫోన్ చేశారు. హోటల్ దగ్గరకు రావాలని కోరారు. తన ఇంట్లో ఎవరూ లేరని చెబుతూ ఆ యువతులిద్దరిని తన ఇంటికే ఆహ్వానించాడా వృద్ధుడు. వారు కోరుకున్నది కూడా ఇదే కాబట్టి ఆలస్యం చేయకుండా వారిద్దరూ ఆ వృద్ధుడి ఇంట్లోకి వెళ్లారు. ఆయనను మాటల్లో పెట్టారు. మాట్లాడుతూనే ఆయన మెడలో ఉన్న రెండు బంగారు గొలుసులను లాక్కుని(Chain snatch) అక్కడ్నుంచి పరారయ్యారు. దీంతో ఆ వృద్ధుడు లబోదిబోమంటూ పోలీస్‌స్టేషన్‌కు పరుగులెత్తాడు. పోలీసులకు విషయం చెప్పాడు. కేసు నమోదు చేసుకున్న వారు దర్యాప్తు చేపట్టారు. శిరీష, సమీనాలను పట్టుకుని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ముసలాయనకు చెందిన బంగారు గొలుసులు స్వాధీనం చేసుకున్నారు. ఉన్నీసాబేగం మరో వ్యక్తితో కలిసి హయత్‌నగర్ పోలీసు స్టేషన్ పరిధిలోనూ ఇదే రీతిలో ఓ వ్యక్తిని మోసం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.