సిద్దిపేట(Siddipeta)లో రాజకీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. సిద్దిపేటలో హరీష్‌ రావు(HarishRao) క్యాంప్ ఆఫీస్‌(Camp office)పై కొందరు దాడి చేశారు.

సిద్దిపేట(Siddipeta)లో రాజకీయ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. సిద్దిపేటలో హరీష్‌ రావు(HarishRao) క్యాంప్ ఆఫీస్‌(Camp office)పై కొందరు దాడి చేశారు. దీరి వెనుక మైనంపల్లి కుమారుడు ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. రైతు రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని చెప్పిన హరీష్ రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేసారు. హరీష్‌రావుపై పోటీ చేస్తానని ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని మైనంపల్లి సవాల్‌ విసిరారు. ఈరోజు సిద్దిపేటలో పోటాపోటీగా కాంగ్రెస్(Congress), బీఆర్‌ఎస్‌(BRS)సమావేశాలు ఏర్పాటు చేశాయి. క్యాంప్‌ ఆఫీస్‌లో రుణమాఫీపై సమావేశాన్ని బీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేయగా, మరోవైపు సిద్దిపేట కాంగ్రెస్‌ ర్యాలీ చేపట్టింది. రుణమాఫీపై రైతులను ప్రభుత్వం మోసం చేసిందంటూ బీఆర్‌ఎస్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయగా.. రుణమాఫీ పూర్తి చేశామంటూ రాజీనామా చేయాలంటూ హన్మంత్‌రావు(Hanumantharao)పోటీగా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అలాగే ర్యాలీ కూడా ఏర్పాటు చేశారు.

మైనంపల్లి హన్మంతరావు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరిన సమయంలో హరీష్‌రావుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మెదక్‌ (Medak)టికెట్‌ కొడుక్కి రానందున, దాని వెనుక హరీష్‌రావు హస్తం ఉందంటూ మెదక్‌ ఏమన్నా హరీష్‌రావు 'కీపా' అని అసభ్య వ్యాఖ్యలు కూడా చేశారు. సిద్దిపేటలో హరీష్‌రావును ఓడించడమే నా లక్ష్యమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రుణమాఫీ విషయంలో హరీష్‌రావుకు వ్యతిరేకంగా మల్కాజ్‌గిరి(Malkajgiri)లో పోస్టర్లు వెలిశాయి. సోషల్‌ మీడియాలో మైనంపల్లిని టార్గెట్‌ చేస్తూ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు విమర్శించారు. ఈరోజు సిద్దిపేటకు వెళ్లిన మైనంపల్లి సవాల్‌ చేశారు. రుణమాఫీ(Runamafi) చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్‌రావు వెంటనే రాజీనామా చేయాలని.. హరీష్‌రావుపై పోటీ చేస్తానని.. ఈ సారి హరీష్‌రావును ఓడించకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ విసిరారు. దీంతో సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ehatv

ehatv

Next Story