అసెంబ్లీలో చర్చ వాడివేడిగా సాగింది. అనంతం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కిందని ఆరోపించారు.
అసెంబ్లీ(Assembly)లో చర్చ వాడివేడిగా సాగింది. అనంతం అసెంబ్లీ మీడియా పాయింట్(Assembly Media Point) వద్ద మాజీ మంత్రి హరీష్ రావు(Harish Rao) మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షం గొంతు నొక్కిందని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) ఖూనీ చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనకు కూడా అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం పారిపోయిందని ఎద్దేవా చేశారు. ఎం.ఐ.ఎం(MIM), బీజేపీ(BJP)లకు అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వం భయపడిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) గోబెల్స్, అబద్దాలను సభలో చెప్పారని.. రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం సీఎం చేశారని విమర్శించారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్(Point Of Order) అడిగినా మాకు అవకాశం ఇవ్వలేదు. మూడు నిమిషాల్లో మూడు సార్లు మైక్ కట్ చేశారని అసహనం వ్యక్తం చేశారు.
తమ తప్పులు బయటపెడతామని ప్రభుత్వం పారిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నేపధ్యం కుటుంబ నేపధ్యమేనన్నారు. విదేశీయురాలు సోనియాగాంధీ(Sonia Gandhi)ని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలుగా చేశారు.. పీ.వీ.నరసింహారావు(PV Narsimha Rao)ను అవమానించింది కాంగ్రెస్ పార్టీ.. ఢిల్లీలో పీ.వీ.నరసింహా రావుకు గుంటడు జాగా ఇవ్వలేదు.. తెలంగాణ బిడ్డ టంగుటూరు అంజయ్య(Tanguturu Anjaiah)ను మాజీ ప్రదాని రాజీవ్ గాంధీ(Rajeev Gandhi) అవమానించారు.. బీఆర్ఎస్ అధికారంలో వున్నప్పుడు ప్రతి సంవత్సరం అమరవీరులను స్మరించుకున్నామని తెలియజేశారు. కానిస్టేబుల్ కృష్ణయ్య(Conistable Krishnaiah) కూతురుని డాక్టర్ చదివించింది బీఆర్ఎస్ ప్రభుత్వమని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమం(Telangana Movement) గురించి మాట్లాడే హక్కు రేవంత్ రెడ్డికి లేదన్నారు.
ఉద్యమంలో రైఫీల్ పట్టుకుని రేవంత్ రెడ్డి తిరగలేదా అని ప్రశ్నించారు.
ఈ రోజుకు మా మీద తెలంగాణ ఉద్యమ కేసులు వున్నాయన్నారు. అనేక ఉద్యమకారుల కేసులను బీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేసిందన్నారు. మాకు క్లారిఫికేషన్ కోసం సభలో మైక్ ఇవ్వలేదన్నారు. తెలంగాణలో 6.59 శాతంతో వ్యవసాయ రంగంలో దేశంలో రెండవ స్థానంలో నిలిచిందని వివరించారు. వ్యవసాయ వృద్ధి రేటులో తెలంగాణ అభివృద్ధి ఘనత బిఆర్ఎస్ పార్టీదేనన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వరి ధాన్యం 24 లక్షల మెట్రిక్ టన్నులు అయితే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కోటీ 20 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నాము. మిరప పంటలో తెలంగాణ మొదటి స్థానంలో వుంది. ప్రత్తి పంటలో దేశంలో రెండవ స్థానంలో తెలంగాణ వుంది. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గాయని వివరించారు.