Harish Rao Assets Details : ఆస్తులు 24 కోట్లు..అప్పులు 11 కోట్లు..హరీష్‌రావు ఎవరికీ పైసా బాకీ లేరు !
ఆరుసార్లు గెలుపు..మూడుసార్లు మంత్రిగా పని చేసిన హరీష్‌రావు(Harish Rao) వ్యక్తిగతంగా ఎవరికీ పైసా బాకీ లేరు. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘానికి(Election commission) సమర్పించిన అఫిడవిట్(affidavit) లో వెల్లడించారు. గురువారం ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్లో ఆస్తులు, అప్పుల(Debt) వివరాలను ప్రకటించారు.
ఆరుసార్లు గెలుపు..మూడుసార్లు మంత్రిగా పని చేసిన హరీష్‌రావు(Harish Rao) వ్యక్తిగతంగా ఎవరికీ పైసా బాకీ లేరు. ఇదే విషయాన్ని ఎన్నికల సంఘానికి(Election commission) సమర్పించిన అఫిడవిట్(affidavit) లో వెల్లడించారు. గురువారం ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్లో ఆస్తులు, అప్పుల(Debt) వివరాలను ప్రకటించారు. వ్యక్తిగతంగా హరీష్‌రావు మీద ఎలాంటి అప్పులు కూడా లేవు. కానీ భార్య శ్రీనితతోపాటు(Sreenitha) కుటుంబ సభ్యుల పేరుమీద అప్పులు ఉన్నట్టు చూపించారు. నామినేషన్(Nomination) పత్రాల్లో ఆయన కుటుంబానికి రూ. 23.82 కోట్ల ఆస్తులు, రూ. 12.6 కోట్ల అప్పులు ఉన్నాయని పేర్కొన్నారు. హరీశ్‌రావు బ్యాంకు ఖాతాలో రూ.20.07 లక్షలు ఉండగా, శ్రీనిత పేరు మీద రూ. 2.27కోట్ల విలువైన రెండు కిలోల బంగారం(Gold), 17 కిలోల వెండి ఉన్నాయి.
అలాగే చరాస్తుల వివరాలు కూడా ప్రకటించారు తన దగ్గర ఉన్న నగదుతోపాటు జీవాటెక్ సర్జికల్స్, అర్వైస్ నేచర్ ప్రొడక్ట్స్, ప్రెస్టన్ డెవలపర్, ఎల్ఐసీ ప్రీమియం అన్నీ కలిపి రూ.13.90 కోట్ల రూపాయల చరాస్తులు ఉన్నట్టు తెలిపారు. ఇక రూ.10.16 కోట్లు విలువ చేసే భూములు, నివాసం, వాణిజ్య ఆస్తులు ఉన్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆస్తులతోపాటు భార్య శ్రీనితకు రూ.11.30 కోట్లు, ఉమ్మడి కుటుంబ సభ్యులుకు రూ.19.5 లక్షలు మేర రుణాలు ఉన్నాయి.
ఎన్నికల నామినేషన్ పత్రంలో తనపై రెండు క్రిమినల్ కేసులు(Criminal cases) ఉన్నాయని, అయితే తెలంగాణ ఉద్యమం సమయంలో నమోదైన ఆ రెండు కేసులు ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నట్టు వెల్లడించారు. అలాగే హరీష్‌రావు పేరు మీద ఓ ఇన్నోవా కారు, రూ.1.30 లక్షల విలువైన బోర్ పిస్టల్ ఉన్నాయి. కుటుంబసభ్యుల పేరిట మూడు ట్రాక్టర్లు ఉన్నాయి. ఇక విద్యకు సంబంధించిన వివరాలను కూడా నామినేషన్ పత్రంలో వెల్లడించారు. కాకతీయ యూనివ్శిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ తీసుకున్నట్లు తెలిపారు.