జగిత్యాల(Jagitala) జిల్లా మల్యాల మండలం మానాలకు చెందిన శివరాత్రి హన్మంతుకు ఉపాధి కరువయ్యింది. కుటుంబాన్ని పోషించుకోవడానికి పొట్ట చేత పట్టుకుని దుబాయ్‌కు(Dubai) వెళ్లాడు. 2005 అక్టోబరు 28వ తేదీన విజిట్ వీసాపై దుబాయ్ వెళ్లాడు. రెండు నెలలు అక్కడ పని చేశాడు. తర్వాత ఖర్మకాలి ఓ హత్య కేసులో(Murder case) చిక్కుకున్నాడు. ఈ కేసులో మొత్తం పది మంది ఆరోపణలు ఎదుర్కున్నారు.
జగిత్యాల(Jagitala) జిల్లా మల్యాల మండలం మానాలకు చెందిన శివరాత్రి హన్మంతుకు(Hanmanthu) ఉపాధి కరువయ్యింది. కుటుంబాన్ని పోషించుకోవడానికి పొట్ట చేత పట్టుకుని దుబాయ్‌కు(Dubai) వెళ్లాడు. 2005 అక్టోబరు 28వ తేదీన విజిట్ వీసాపై దుబాయ్ వెళ్లాడు. రెండు నెలలు అక్కడ పని చేశాడు. తర్వాత ఖర్మకాలి ఓ హత్య కేసులో(Murder case) చిక్కుకున్నాడు. ఈ కేసులో మొత్తం పది మంది ఆరోపణలు ఎదుర్కున్నారు. తెలంగాణకు చెందిన అయిదుగురికి దుబాయ్ కోర్టు 25 ఏళ్ల చొప్పున జైలుశిక్ష విధించింది. పాపం భర్తను విడిపించుకోవడానికి హన్మంతు భార్య పద్మ ఎంతగానో కష్టపడింది. వీరి దీనస్థితిని గమనించిన అప్పటి మంత్రి కేటీఆర్(KTR) క్షమాభిక్ష కింద విడిపించేందుకు ప్రయత్నించారు. హత్యకు గురైన వ్యక్తి కుటుంబీకులతో మాట్లాడి పరిహారం చెల్లించారు. న్యాయపోరాటం కోసం ఆర్థిక సహాయం అందించారు. ఎన్నో ప్రయత్నాల అనంతరం కోర్టు క్షమాభిక్ష ప్రసాదించింది. దాంతో వారంతా స్వదేశానికి వస్తున్నారు. ఆరు నెలల కిందట ఓ వ్యక్తి విడుదలయ్యాడు. హన్మంతు ఈ మధ్యనే జైలు నుంచి బయటకు వచ్చాడు. శనివారం రాత్రి స్వస్థలానికి చేరుకున్నాడు.
అలాగే సిరిసిల్ల పెద్దూరుకు చెందిన శివరాత్రి మల్లేశం, రవి కూడా ఈ నెల 21వ తేదీన ఇంటికి చేరుకోనున్నారు. చందుర్తి మండలానికి చెందిన నాంపల్లి వెంకటి కూడా త్వరలో ఇండియాకు వెళ్లనున్నట్టు దుబాయ్‌లో ఉన్న వారి స్నేహితులు చెప్పారు. ఉపాధి కోసం హన్మంతుకు దుబాయ్‌కు వెళుతున్నప్పుడు ఆయన కూతురు వయసు 21 ఏళ్లు. పుట్టిన పాపకు గౌతమిగా నామకరణం చేసిన మరుసటి రోజే హన్మంతు దుబాయ్‌కు వెళ్లాడు. ఇప్పుడు గౌతమి వయసు 18 ఏళ్లు. అతడు జైల్లో ఉన్నప్పుడు అతడి తండ్రి ఎల్లయ్య మృతి చెందాడు. భార్య పద్మ రోజంతా కూలి పనిచేసేది. రాత్రి బీడీలు చుట్టేది. అలా కుటుంబాన్ని పోషిస్తూ వచ్చింది. భర్త హన్మంతు జైలులో ఉండడం, కుమార్తె మానసిక స్థితి బాగాలేకపోవడంతో ఆమె బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామంలోని తన పుట్టింటికి వెళ్లింది. తమను విడిపించడానికి అప్పటి మంత్రి కేటీఆర్ చేసిన కృషిని మర్చిపోలేమని హన్మంతు అన్నాడు. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని, దుబాయ్‌లో చేయని నేరాన్ని తమ మీద మోపారని తెలిపాడు.