ఉద్యమ కాలంలో బీఆర్‌ఎస్‌ (BRS)చేరిన గువ్వల బాలరాజు (Guvvala BalaRaju).. 2009లో నాగర్‌కర్నూల్‌ ఎంపీ(MP)గా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ను కలిశారని, కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తలు వచ్చాయి. కేసీఆర్‌ దీక్ష, తెలంగాణ కోసం అన్ని వర్గాల ఉద్యమంతో గులాబీ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాడు. నియోజకవర్గంలో అప్పటి టీఆర్‌ఎస్‌(TRS), ఇప్పటి బీఆర్‌ఎస్‌కు పెద్దదిక్కుగా ఉన్నాడు. 2014లో బీఆర్‌స్‌ అధిష్టానం ఇతనికి టికెట్‌ కేటాయించింది. ఉద్యమ సానుభూతి, కేసీఆర్‌ అనుకూల పవనాలతో బొటాబొటీ మెజార్టీతో బయట పడ్డాడు.

ఉద్యమ కాలంలో బీఆర్‌ఎస్‌ (BRS)చేరిన గువ్వల బాలరాజు (Guvvala BalaRaju).. 2009లో నాగర్‌కర్నూల్‌ ఎంపీ(MP)గా పోటీ చేసి ఓడిపోయారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ను కలిశారని, కాంగ్రెస్‌లో చేరుతారనే వార్తలు వచ్చాయి. కేసీఆర్‌ దీక్ష, తెలంగాణ కోసం అన్ని వర్గాల ఉద్యమంతో గులాబీ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాడు. నియోజకవర్గంలో అప్పటి టీఆర్‌ఎస్‌(TRS), ఇప్పటి బీఆర్‌ఎస్‌కు పెద్దదిక్కుగా ఉన్నాడు. 2014లో బీఆర్‌స్‌ అధిష్టానం ఇతనికి టికెట్‌ కేటాయించింది. ఉద్యమ సానుభూతి, కేసీఆర్‌ అనుకూల పవనాలతో బొటాబొటీ మెజార్టీతో బయట పడ్డాడు.

ఆ తర్వాత వరుస వివాదాల్లో చిక్కుకున్నాడు. గువ్వల బాలరాజు.. ముందు నుంచీ దూకుడు స్వభావం.. వివాదాలకు నిలయం.. గతంలో మహబూబ్‌నగర్‌ జెడ్పీ మీటింగ్‌లో సహచర ఎమ్మెల్యే చెంప చెల్లుమనిపించిన ఘన చరిత్ర బాలరాజ్‌ది. ఆ తర్వాత అటవీ అధికారుల పట్ల దురుసుతనం, టీవీ చర్చల్లో దూకుడుగా మాట్లాడడం ఇతనికి అలవాటు. ఈ దుందుడుకు తనాన్ని నియోజకవర్గ ప్రజల మీద కూడా చూపెట్టే నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు. నియోజకవర్గంలో అహంకారంగా వ్యవహరిస్తాడని ప్రతిపక్షాలు ప్రతిరోజు ఆరోపణలు గుప్పిస్తుంటాయి. కేసీఆర్‌ (KCR) చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కూడా నియోజకవర్గానికి రావడం.. అభివృద్ధిలో మార్పు కనపడింది. తమ పట్ల ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపిస్తూ క్రమేణా సొంత పార్టీ నేతలే పార్టీకి దూరమవుతూ వచ్చారు.

2018 ఎన్నికల్లో కూడా గువ్వల బాలరాజు కచ్చితంగా ఓడిపోతాడనే అంచాన వేశారు. అప్పడు కేసీఆర్‌ ప్రభుత్వంపై సానుకూలత, కేసీఆర్‌ మొహం చూసి ఓట్లు పడడంతో అంత గాలిలో కూడా అత్తెసరు ఓట్లతో బయటపడ్డాడు. రెండో సారి గెలిచిన తర్వాత ఇతడికి గర్వం మరీ ఎక్కువైందని నియోజకవర్గంలో టాక్. గ్రామంలో తమ సామాజిక వర్గానికి చెందిన కొందరిని నియమించుకొని తన పార్టీకే చెందిన అగ్రకుల నేతలపై స్పై ఏర్పాటు చేశాడని ఆరోపణలు వచ్చాయి. పార్టీ కార్యక్రమాల్లో.. ' ఆ పార్టీల్లో' ఎవరైనా అగ్రకుల నేతలు మాట జారితే.. ఈ స్పై బ్యాచ్‌ ఆ సమాచారాన్ని ఎమ్మెల్యేకు చేరవేసేవారు. ఆ తర్వాత మెల్లగా ఆ నాయకుల పట్ల మరింత దూకుడుగా వ్యవహరించేవాడన్న చర్చ తెరపైకి వచ్చింది. అంతే కాదు.. మరోసారి ఎమ్మెల్యేగా గెలిస్తే తాను 'యాంటీ ఓసీ ఫోర్స్‌' (Anti OC Force) ఒకటి తయారుచేసి దానిని పటిష్టంగా తయారుచేయాలనుకుంటున్నానని సన్నిహితులతో చెప్పడంతో ఇది ఆ నోటా.. ఈ నోటా తెలిసి ఓసీ (OC)లకు ఆగ్రహం తెప్పించింది.

నియోజకవర్గంలో రెడ్డి (Reddy) సామాజికవర్గం కూడా చాలా ప్రభావితం చూపగలదు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కూడా ఇదే కావడంతో ఇక్కడ రెడ్డీలు పూర్తిగా వ్యతిరేకంగా పనిచేశారని వినికిడి. రెడ్డి, వెలమ (Velama) సామాజికవర్గం వారు ఎక్కువ శాతం అసంతృప్తితో ఉన్నారు. రెడ్డి, వెలమ నాయకుల పట్ల అగౌరవంగా, లెక్కలేనితనంగా మాట్లాడుతాడని ఎమ్మెల్యేపై ప్రధాన ఆరోపణ ఉంది. 80శాతానికిపైగా రెడ్డీలు, వెలమలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఉన్నారు. ఒకరిద్దరు ఓసీ నాయకులు మరోసారి గువ్వల గెలిస్తే మనల్ని పురుగు కంటే హీనంగా చూస్తాడు.. అని ఆందోళన పడ్డారట. గతంలో అదే పార్టీకి చెందిన వెలమ సామాజిక వర్గానికి చెందిన ఓ నేత.. తన ప్రమేయం లేకుండా అప్పటి మంత్రి జూపల్లి నుంచి స్వగ్రామానికి నిధులు మంజూరు చేయించుకుంటే.. పెద్దమనిషని చూడకుండా నియోజకవర్గ సమావేశంలో చిర్రుబుర్రులాడడంతో అతను కాంగ్రెస్‌ పార్టీలో చేరి వంగూరు (Vangoor) మండలానికి అధ్యక్షుడయ్యాడు. ఈ సంఘటనతో ఎవరికైనా మంత్రులతో ప్రత్యక్ష సంబంధాలుంటే.. తమ గ్రామాలకు నిధులు తెచ్చుకుందామనుకున్నవారు గప్‌చుప్‌ అయ్యారట. మంత్రులతో నిధులు తెచ్చుకోవాలంటే ఎమ్మెల్యే సిఫారసు ఉండాలి. ఈ సిఫారసు లెటర్ల కోసం తన దగ్గరికి వెళ్తే ఎలా రియాక్ట్‌ అవుతాడోనన్న భయంతో గమ్మున ఉండేవారట. ఇలాంటి ఘటనలతో మెల్లగా ఈ రెండు కులాలు తన పట్ల వ్యతిరేకించుకున్నాయని తెలిసింది.

లింగాల (Lingala) మండలానికి చెందిన మరో కీలక వెలమ నేత నారపల్లి శ్రీనివాసరావుతో కూడా అప్పట్లో తీవ్ర విభేదాలు రావడంతో అతను కూడా కాంగ్రెస్‌లో చేరి గువ్వల ఓటమికి పనిచేశారు. అవినీతి ఆరోపణలు పెద్దగా లేనప్పటికీ ఈ దూకుడు, దుందుడుకు తనం, నోటి దురుసు తన పుట్టి ముంచాయని టాక్‌. ఎంపీ రాములు (Ramulu), అతని కుమారుడు, కల్వకుర్తి జెడ్పీటీసీ (Zptc) భరత్‌తో కూడా బాలరాజుకు సఖ్యత లేకపోవడంతో ఆ వర్గం ఈ సారి గువ్వలకు వ్యతిరేకంగా పనిచేసిందని రూమర్లు వస్తున్నాయి. ఇప్పటికైనా అందరినీ కలుపుకుని వెళ్లి, తెలిసో తెలియకో చెసిన పొరపాట్లను మార్చుకోవాలని.. ఈ వ్యవహారశైలి ఇలాగే కొనసాగితే మరోసారి ఎమ్మెల్యేగా గెలవడం కష్టమేనని నియోజకవర్గ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Updated On 13 Dec 2023 10:48 PM GMT
Ehatv

Ehatv

Next Story