ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ పార్ఈ సీనియర్ నేత, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు కాంగ్రెస్ పార్టీలో చేశారు.

Gutta Amit Reddy joined the Congress Party in the presence of Chief Minister Revanth Reddy
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఆ పార్ఈ సీనియర్ నేత, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు కాంగ్రెస్ పార్టీలో చేశారు. ఈ ఉదయం తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ దీప్ దాస్ మున్షీ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుత్తా అమిత్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రోహిత్ చౌదరీ, పీసీసీ జనరల్ సెక్రటరీ రోహిన్ రెడ్డితో కలిసి గుత్తా అమిత్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో గుత్తా అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుత్తా అమిత్ తో పాటు మదర్ డైరీ మాజీ చైర్మన్ గుత్తా జితేందర్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. గుత్తా అమిత్ రెడ్డి, జితేందర్ రెడ్డిలను కాంగ్రెస్ కండువా కప్పి సీఎం రేవంత్ రెడ్డి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. సీఎంతోపాటు కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరీ, డీసీసీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి తదితరులు ఉన్నారు.
