కర్ణాటకలో(Karnataka) చిత్తుగా ఓడినా బీజేపీ(BJP) వాళ్లకు ఇంకా బుద్ధి రావడం లేద‌ని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy) అన్నారు. నల్గొండలోని(Nalgonda) క్యాంపు కార్యాలయంలో నిర్వ‌హించిన‌ మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణలో అస్సాం సీఎం హిమంత బిశ్వ‌ శర్మ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదు.

కర్ణాటకలో(Karnataka) చిత్తుగా ఓడినా బీజేపీ(BJP) వాళ్లకు ఇంకా బుద్ధి రావడం లేద‌ని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy) అన్నారు. నల్గొండలోని(Nalgonda) క్యాంపు కార్యాలయంలో నిర్వ‌హించిన‌ మీడియా సమావేశంలో ఆయ‌న మాట్లాడుతూ.. తెలంగాణలో అస్సాం సీఎం హిమంత బిశ్వ‌ శర్మ చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదు. మత కల్లోలాలు లేపి ఎలాగైనా అధికారంలోకి రావలన్నదే బీజేపీ పార్టీ కుట్ర అని అన్నారు. కాంగ్రెస్(Congress) కు కూడా ఇంకా బుద్ధి రావడం లేదు. నాలుగు రోజులైనా ఇంకా కర్ణాటకలో సీఎంను నిర్ణయించే స్వేచ్ఛ ఆ పార్టీ లో లేదు. ఇక‌ కాంగ్రెస్ పార్టీ దేశానికి ఎలాంటి నాయకత్వం వహిస్తుంది అనేది ప్రజలు ఆలోచన చేయాలన్నారు.

కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు ఊహల్లో తెలియాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ లో కాంగ్రెస్(Telangana Congress) ,బీజేపీ(BJP) పార్టీల పప్పులు ఉడకవు. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే యావత్ తెలంగాణ సమాజం నడుస్తుందన్నారు. రాజస్థాన్ లో కాంగ్రెస్ కల్లోలం చూస్తూనే ఉన్నాం. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ నాయకులే తిరుగుబాటు చేసి, రాజకీయ అస్థిరత్వం తెచ్చారని అన్నారు. మతోన్మాద బీజేపికి, దిక్కు దివానా లేని కాంగ్రెస్ పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే కేసీఆర్ నాయకత్వమే శరణ్యం అన్నారు. కర్ణాటక లో బీజేపీకి ప్రజలు సరైన బుద్ధి చెప్పారు. అంతర్గత విభేదాలతో నానాటికి కాంగ్రెస్ పార్టీ కునారిల్లి పోతుందన్నారు. కేసీఆర్‌ నాయకత్వంలోనే దేశం, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు.

Updated On 16 May 2023 12:03 AM GMT
Ehatv

Ehatv

Next Story