ఎన్నికలు జరిగి నెల రోజులు కూడా అవకముందే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ శ్రేణులు దాడులకు పాల్పడటం దుర్మార్గమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
ఎన్నికలు(Elections) జరిగి నెల రోజులు కూడా అవకముందే ఉమ్మడి నల్గొండ(Nalgonda) జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్(BRS) నేతలపై కాంగ్రెస్(Congress) శ్రేణులు దాడులకు పాల్పడటం దుర్మార్గమని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి(Guntakandla Jagadish Reddy) పేర్కొన్నారు. తుంగతుర్తి(Thungathurthi) నియోజకవర్గం జాజిరెడ్డిగూడెం(Jajireddygudem) మండలం, కాసర్ల పహాడ్ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నాయకుడు, ఆదర్శ రైతు, కేసీఆర్(KCR) వీరాభిమాని అయిన మేండే సురేష్(Suresh)పై కాంగ్రెస్ శ్రేణులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండించారు. జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న సురేష్ ను తుంగతుర్తి మాజీ శాసనసభ్యుడు గాధరి కిషోర్ కుమార్(Kishore Kumar) తో కలిసి జగదీష్ రెడ్డి పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ఇరువురు నేతలు ధైర్యం చెప్పారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన జగదీష్ రెడ్డి.. ఘర్షణలు తెలంగాణ సమాజానికి మంచిది కాదన్నారు. రాజకీయ తగదాలతో గ్రామాలకు గ్రామాలు వల్లకాడులు అయిన గత చరిత్ర నల్గొండ జిల్లా ది అన్న జగదీష్ రెడ్డి.. ఘర్షణలు అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తాయని, గడిచిన 10 ఏళ్లుగా మా పాలనలో రాజకీయ ఘర్షణలకు తావు లేకుండా చేశాం అన్నారు. చిన్నాచితక ఘర్షణలు జరిగినా పార్టీలకతీతంగా వ్యవహరించి ఆదిలోనే అణిచివేశామన్నారు. ఉమ్మడి జిల్లా లో రాజకీయ దాడులను ఆపాల్సిన బాధ్యత జిల్లా మంత్రులది, పోలీసు అధికారులదే అన్నారు. ముందు జాగ్రత్తలు తీసుకోకపోతే నల్లగొండ జిల్లా నాశనం అవుతుంది అన్నారు. ఘర్షణలను అదుపు చేయడంలో పోలీసులునిష్పక్షపాతంగా వ్యవహరించాలి అని కోరారు. పది ఏళ్లుగా ప్రశాంతంగా ఉన్న గ్రామాలలో ప్రశాంతతను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు.ఈ విషయంలో జిల్లా మంత్రులు చొరవ తీసుకోవాలి అని కోరారు. మరోవైపు ప్రజాపాలన ,గ్రామ సభలలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పాల్గొంటారన్నారు స్థానిక సంస్థలు, ప్రజా ప్రతినిధులకు తగిన గౌరవం లభించడం లేదన్న జగదీష్ రెడ్డి.. నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పిస్తామని, ఆ కార్యక్రమాన్ని రద్దు చేయడమే దానికి నిదర్శనం అన్నారు. పాలనలో అపరిపక్వత తప్పించుకునే ధోరణి కనబడుతుంది అన్నారు. కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారంటీ పథకాలు అమలయ్యేలా, స్థానిక ప్రజా ప్రతినిదులు చొరవ తీసుకుని ప్రజలకు అందేలా చర్యలు చేపట్టాలని పిలుపు నిచ్చారు.