మరో వివాహేతర(Extra Marrital Affair) సంబంధం ఓ కాపురాన్ని కూల్చివేసింది.. చిన్నారిని అనాథను(Orphan) చేసింది. ఓ భార్య చేసిన పనికి మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. తన చావుకు కారణాలను సెల్ఫీ వీడియోలో(Selfi Video) వివరించాడు. ఖమ్మం(Khammam) జిల్లా ముందిగొండ మండలం బాణాపురంలో(Banapuram) ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

Khammam Husband suicide

ఓ మహిళ తన భర్తను వదిలేసి.. ప్రియుడితో(Lover) వేరు కాపురం పెట్టింది. తమతో పాటు కలిసి ఉండాలని భర్తకూ కండీషన్ పెట్టింది. భార్య చేసిన పనికి మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. గుండాల వంశీకి(Gundala Vamsi) ముదిగొండ మండలం గోకినేపల్లికి చెందిన యువతితో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఓ కుమారుడు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో తన భార్యకు మరొకరితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఏకంగా ప్రియుడితో విడిగా కాపురం పెట్టేసింది.
ఎన్ని సార్లు చెప్పినా ఆ మహిళ తన భర్త మాట వినలేదు. ప్రియుడిని విడిచిపెట్టేది లేదని మంకుపట్టు పట్టింది. భార్య ప్రవర్తనతో మనస్తాపం చెందిన వంశీ ఈనెల 18న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. అందులో తన భార్య వివాహేతర సంబంధం వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పినట్లు తెలిసింది. ఈ వీడియో ఆదివారం బయటపడడంతో వంశి తండ్రి శివయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. భార్య, ప్రియుడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపిన పోలీసులు.. దీనిపై విచారిస్తున్నామన్నారు.