జీవో 29పై విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది.

జీవో 29పై విచారణను తెలంగాణ హైకోర్టు ఈ నెల 26వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు ముగిసాయి. పరీక్షలు జరిగినా సరే జీవో 29 రద్దు చేయాల్సిందేనని చాలా మంది అభ్యర్థులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. ఇవాళ జీవో 29పై హైకోర్టు విచారణ జరిపి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుదని అనుకున్నారు. అయితే విచారణను హైకోర్టు వాయిదా వేసింది. గ్రూప్ 1 పరీక్షలు ముగిసినా జీవో 29 పై తేలకుండా ఫలితాలు వెల్లడించవద్దని ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అభ్యర్థుల ఆందోళనల నడుమనే ప్రభుత్వం మెయిన్స్ పరీక్షలు నిర్వహించింది. పరీక్షలు రద్దు కోరుతూ గతంలోనే అభ్యర్థులు సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించారు. చివరి నిమిషంలో సుప్రీంకోర్టును ఆశ్రయించినందున తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టులోనే తేల్చుకోవాలని అభ్యర్థులకు చెప్పిన సంగతి తెలిసిందే.

ehatv

ehatv

Next Story