సంగారెడ్డి జిల్లా(Sanga reddy) కేంద్రంలో జరిగిన యాదవుల సదర్ సమ్మేళనం(Sadhar) అంగరంగ వైభవంగా జరిగింది.
సంగారెడ్డి జిల్లా(Sanga reddy) కేంద్రంలో జరిగిన యాదవుల సదర్ సమ్మేళనం(Sadhar) అంగరంగ వైభవంగా జరిగింది. టీపీసీసీ(TPCC) వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jaga reddy) సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. హైదరాబాద్ నుండి ప్రత్యేకంగా తెప్పించిన దున్న రాజుల విన్యాసాలు యాదవుల ఆటపాటలు పట్టణ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. జగ్గారెడ్డి దున్న రాజులపై ఎక్కి హుషారుగా యాదవ సోదరులతో కలిసి డాన్సులు చేశారు. సదర్ ఉత్సవం సందర్బంగా యాదవుల(Yadav) కులదైవం అయిన శ్రీకృష్ణుని(Sri krishna) పాటను యాదవులతో కలిసి పాడారు. సదర్ సమ్మేళనంలో TGIIC ఛైర్‌పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి(Nirmala jagareddy), తోపాజి అనంతకిషన్, జూలకంటి ఆంజనేయులు, కూన సంతోష్, కిరణ్ గౌడ్, మహేష్ మరియు సదర్ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రదీప్ యాదవ్, బాలు యాదవ్, శ్రీశైలం యాదవ్, సతీష్ యాదవ్, నాగు యాదవ్ తో పాటు పెద్ద సంఖ్యలో యాదవులు మహిళలు పాల్గొన్నారు