మహబూబాబాద్ జిల్లా కే సముద్రంమండలం తాళ్లపూసపల్లి గ్రామంలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమయ్యింది. కానుపు కోసం సిరిసిల్లలోని తన పుట్టింటికెళ్లింది సంహిత అనే ఓ ఆడపడచు. మూడు నెల కిందట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మూడు నెల తర్వాత అత్తగారింటికి వచ్చింది.
ఆడపిల్లకు ఇటీవల ఓ రాజకీయ నాయకురాలు ఇచ్చిన నిర్వచనం జోలికి వెళ్లడం లేదు కానీ, ఆడపిల్ల అంటే భారమనుకునే రోజులు మాత్రం పోయాయి. ఆడపిల్లను కడుపులోనే చంపించే క్రూర సంస్కృతి కొన్ని చోట్ల ఉండేది. పుట్టిన బిడ్డను చెత్తకుప్పల్లో వేసి వదిలించుకునే బాపతుగాళ్లు అక్కడక్కడ ఇంకా ఉన్నారు. ఆడపిల్లకు జన్మనిచ్చిందని పచ్చి బాలింతను ఇంట్లోంచి తరిమేసిన పురుషపుంగవులను కూడా మనం చూశాం. ఇప్పుడా పరిస్థితి లేదు. తెలంగాణలో అయితే ఎప్పట్నుంచే అడపిల్లను గుండెలకు హత్తుకుని పెంచుకుంటున్నారు. మహబూబాబాద్ జిల్లా కే సముద్రంమండలం తాళ్లపూసపల్లి గ్రామంలో ఓ అద్భుత దృశ్యం ఆవిష్కృతమయ్యింది. కానుపు కోసం సిరిసిల్లలోని తన పుట్టింటికెళ్లింది సంహిత అనే ఓ ఆడపడచు. మూడు నెల కిందట పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మూడు నెల తర్వాత అత్తగారింటికి వచ్చింది. ఆమెకు అత్తమామలు శ్రీనివాసాచారి, భద్రకాళి సాదర స్వాగతం పలికారు. అలా ఇలా కాదు, ఏకంగా పూటబాటనే పరిచారు. తొలుచూరు కానుపులో ఆడబిడ్డ పుట్టడం అదృష్టమని అనుకుందా కుటుంబం. ఇంటికి మహాలక్ష్మి వచ్చిందన్నంతగా సంబురపడిపోయింది. రావమ్మా మహాలక్ష్మి రావమ్మా అంటూ తల్లిబిడ్డలపై పూలవర్షం కురిపించింది. ఇంటి బయట నుంచి లోపలి వరకు పూల బాట పరిచారు. తొలిసారి పాప ఇంట్లో అడుగు పెడుతున్నందున కాలి ముద్రలను తీసుకున్నారు.