నల్గొండ(Nalgonda), ఖమ్మం(Khammam), వరంగల్(Warangal) జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక(MLC By ELections) ప్రారంభమయ్యింది. ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుంది.

నల్గొండ(Nalgonda), ఖమ్మం(Khammam), వరంగల్(Warangal) జిల్లాల గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక(MLC By ELections) ప్రారంభమయ్యింది. ఉదయం ఎనిమిది గంటలకు మొదలైన పోలింగ్‌ సాయంత్రం నాలుగు గంటల వరకు జరుగుతుంది. జూన్‌ 5వ తేదీన కౌంటింగ్‌ జరుగుతుంది. ఉప ఎన్నిక బరిలో 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇందులో స్వతంత్ర అభ్యర్థులు 38 మంది ఉన్నారు. పోలింగ్‌ కోసం మొత్తం 600 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం గ్రాడ్యుయేట్ ఓటర్లు 4,63,839 ఉండగా, ఇందులో పురుషులు 2,88,189, స్త్రీలు 1,75,645 ఉన్నారు. ట్రాన్స్ జెండర్ ఓట్లు అయిదు ఉన్నాయి.

Updated On 27 May 2024 12:49 AM GMT
Ehatv

Ehatv

Next Story