మెద‌క్ ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్‌ అభ్యర్ధి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై కత్తి దాడి నేపథ్యంలో పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

మెద‌క్ ఎంపీ(Medak MP), దుబ్బాక(Dubbaka) అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్‌ అభ్యర్ధి కొత్త ప్రభాకర్‌రెడ్డి(Kotha Prabhakar Reddy)పై కత్తి దాడి నేపథ్యంలో పోలీసు శాఖ(Police Department) కీలక నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎస్‌(BRS)కు చెందిన‌ ఎమ్మెల్యేలు, ఎంపీలకు భద్రత పెంచుతూ ఇంటెలిజెన్స్ అడిష‌న‌ల్ డీజీపీ(Additional DGP of Intelligence) మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం 2+2 భద్రతను 4+4గా పెంచుతున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) పోటీ చేస్తున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల(BRS Candidates)కు భద్రతను తక్షణమే పెంచాలని.. రాష్ట్రంలోని అన్ని యూనిట్ల అధికారులు భద్రతా ఏర్పాట్లను పరిశీలించాలని ఆదేశాలు జారీ చేశారు.

Updated On 31 Oct 2023 7:32 PM GMT
Yagnik

Yagnik

Next Story