చెంచు గిరిజన మహిళ ఈశ్వరమ్మపై దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బాధితురాలికి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

చెంచు గిరిజన మహిళ ఈశ్వరమ్మపై దాడికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిన పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బాధితురాలికి రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. కొల్లాపూర్ మండల పరిధిలోని మొలచింతలపల్లి గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ పనికి రాలేదని వారం రోజులుగా ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. నిందితులు ఆమె కళ్లలో కారం పోసి.. ఆమె ప్రైవేట్ భాగాలను కాల్చారు. వారం రోజులుగా ఈ వేధింపులు కొనసాగుతుండగా.. బుధవారం స్థానికులు కొల్లాపూర్ పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

ప్రస్తుతం ఈశ్వరమ్మ నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. శనివారం ఉదయం ఆసుపత్రిలో ఆమెను కలిసిన మంత్రి ఆమెకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని చెప్పారు. ఇది దురదృష్టకర సంఘటన అని పేర్కొన్న మంత్రి.. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈశ్వరమ్మ ముగ్గురు పిల్లలను రెసిడెన్షియల్ స్కూల్‌లో చేర్పిస్తామని.. ఆమె కుటుంబానికి ఎలాంటి ఆర్థిక భారం పడకుండా అన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి మీడియా ప్రతినిధులతో చెప్పారు.

Eha Tv

Eha Tv

Next Story