తెలంగాణ గవర్నర్(Governor of Telangana) తమిళి సై(Tamilisai Soundararajan) రాజ్‌భవన్‌ను(Raj Bhavan) రాజకీయ అడ్డాగా మార్చుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి(Vemula Prashanth Reddy).
తెలంగాణ గవర్నర్(Governor of Telangana) తమిళి సై(Tamilisai Soundararajan) రాజ్‌భవన్‌ను(Raj Bhavan) రాజకీయ అడ్డాగా మార్చుకుని రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి(Vemula Prashanth Reddy). గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా దాసోజు శ్రవణ్(Dasoju Sravan), కుర్రా సత్యనారాయణ పేర్లను రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపి పంపితే వారికి రాజకీయ నేపథ్యం ఉందని తిరస్కరించడం అత్యంత దుర్మార్గమని అన్నారు.
అత్యంత వెనుక బడిన కులాలకు చెందిన సామాజిక కార్యకర్త దాసోజు శ్రవణ్, షెడ్యుల్ తెగకు చెందిన సామాజిక కార్యకర్త కుర్రా సత్యనారాయణ లను రిజెక్ట్ చేయడం యావత్ తెలంగాణ ఎంబీసి కులాలను,ఎస్టీ సమాజాన్ని అగౌర పర్చినట్టేనని ఆయన అన్నారు. రాజకీయ నేపథ్యం ఉందని తెలంగాణ ఉద్యమకారులను అవమాన పరిచిన గవర్నర్ తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ డైరెక్ట్ గా తెలంగాణ గవర్నర్ గా నియమించబడలేదా అంటూ ఆయన ప్రశ్నించారు. తమిళి సై కి నైతిక విలువలు ఉంటే ఆమె వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సర్కారియ కమిషన్ చెప్పినట్టు రాజకీయాలకు సంబంధం లేని వారిని గవర్నర్లు గా నియమించాలని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోదీ చాలా సార్లు వ్యాఖ్యానించారని, సర్కారియ కమిషన్ సూచనలు తుంగలో తొక్కి ఒక రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిని గవర్నర్ గా నియమించారని వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఇది పూర్తిగా సర్కారియా కమిషన్ సూచనలకు విరుద్ధమని చెప్పారు.