తెలంగాణ రాష్ట్రంలో కొన్నాళ్లుగా కొనసాగుతున్న గవర్నర్ తమిళ్ సై , గవర్నమెంట్ వార్ సమస్య సమసిపోయిందని భావిస్తున్న సందర్భంలోనే వార్ మళ్లీ మొదటికి వచ్చింది. గవర్నర్ తమిళ్ సై ...తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిపై ట్విట్టర్ వేదికగా గరం అయ్యారు. సీఎస్ గా బాధ్యతలు తీసుకున్నాక ఒక్కసారి కూడా కలవడానికి రాజ్ భవన్ కి రాలేదని ...ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గరుందని గవర్నర్ ఫైర్ అయ్యార్ ...కనీసం ఫోన్ లో అయిన మాట్లడలేదని ఆమె […]
తెలంగాణ రాష్ట్రంలో కొన్నాళ్లుగా కొనసాగుతున్న గవర్నర్ తమిళ్ సై , గవర్నమెంట్ వార్ సమస్య సమసిపోయిందని భావిస్తున్న సందర్భంలోనే వార్ మళ్లీ మొదటికి వచ్చింది. గవర్నర్ తమిళ్ సై ...తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారిపై ట్విట్టర్ వేదికగా గరం అయ్యారు. సీఎస్ గా బాధ్యతలు తీసుకున్నాక ఒక్కసారి కూడా కలవడానికి రాజ్ భవన్ కి రాలేదని ...ఢిల్లీ కంటే రాజ్ భవన్ దగ్గరుందని గవర్నర్ ఫైర్ అయ్యార్ ...కనీసం ఫోన్ లో అయిన మాట్లడలేదని ఆమె ట్వీట్ చేసారు. సీఎస్ ప్రోటోకాల్ పాటిస్తూ తనను కలిసి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఇలా సుప్రీంకోర్టుకు వెళ్లడం కంటే తనతోనే మాట్లాడి ఉంటే సమస్య పరిష్కారం అయ్యేదని గవర్నర్ అన్నారు.
సీ ఎస్ గా బాధ్యతలు తీసుకున్న శాంతికుమారి గవర్నర్ ముందు 10 బిల్లులు పెండింగ్ ఉన్నాయని ..అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు గవర్నర్ ఆమోదించేలా చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. 5 నెలలు గడిచినా బిల్లుల్ని గవర్నర్ ఆమోదించలేదని సీఎస్ పిటిషన్ లో తెలిపారు . బిల్లుల విషయంలో రాజ్యాంగం ప్రకారం వాటిపై సర్వాధికారాలు గవర్నర్ కు ఉంటుంది. వాటిని ఆమోదించడం లేదా తిరస్కరించడం అనేది గవర్నర్ చేతిలోనే ఉంటుంది. కానీ గవర్నర్ ఈ బిల్లుల విషయంలో కావాలనే జాప్యం చేస్తున్నారనేది ప్రభుత్వం వాదన. మరి సుప్రీంకోర్టు దీనిపై ఏం చెప్పనుందనేది ఆసక్తికరంగా మారింది.