హైదరాబాద్ నారాయణగూడలోని(Narayanaguda) ప్రభుత్వ పాఠశాల(Government school) విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాఠశాలలో సరైన వసతులు లేవని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనవ‌డైన హిమాన్షు ను(Himanshu) తమ పాఠశాలను దత్తతకు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలపైన హిమాన్షు అన్నయ్యకు ఉన్నంత శ్రద్ధ కూడా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి(sabitha Indra Reddy) లేదంటూ పిల్లలు ప్లకార్డులు(Placards) పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నారాయణగూడలోని(Narayanaguda) ప్రభుత్వ పాఠశాల(Government school) విద్యార్థులు ఆందోళనకు దిగారు. పాఠశాలలో సరైన వసతులు లేవని.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ మనవ‌డైన హిమాన్షు ను(Himanshu) తమ పాఠశాలను దత్తతకు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలపైన హిమాన్షు అన్నయ్యకు ఉన్నంత శ్రద్ధ కూడా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి(sabitha Indra Reddy) లేదంటూ పిల్లలు ప్లకార్డులు(Placards) పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఏఐవైఎఫ్(AIYF), బాల సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులు ప్లకార్డులు చేతబట్టి.. హిమాన్షు అన్న తమ పాఠశాలను ద‌త్త‌త తీసుకొని బాగు చేయాలని నినాదాలు చేశారు. బాత్ రూమ్ డోర్లు విరిగిపోయాయని, పాఠశాలకు ప్లే గ్రౌండ్ లేదని, కంప్యూటర్లు లేవని విద్యార్థులు వారి ఆవేదన వ్యక్తం చేశారు. తమ పాఠశాలను కూడా దత్తతకు తీసుకొని తాము చదువుకునేందుకు సహకరించాలని విద్యార్ధులు హిమాన్షుని కోరారు.

ఏఐవైఎఫ్, బాల సంఘం నాయ‌కులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న 24 వేల ప్రభుత్వ పాఠశాలలో ఇదే పరిస్థితి ఉందని ఆరోపించారు. మన బస్తీ, మన బడి నిధులు పక్కదారి పట్టిస్తూ ప్రభుత్వ పాఠశాలలను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఈ విధంగానే ఉందని.. పాఠశాలలో విద్యార్థులకు సరైన సదుపాయాలు కూడా లేవని అన్నారు.

Updated On 14 July 2023 4:29 AM GMT
Ehatv

Ehatv

Next Story