తెలంగాణలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా గత గురువారం నుంచి శనివారం వరకూ ప్రభుత్వం పాఠశాలలను మూసివేసింది. వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రభుత్వం మంగళవారం మరోసారి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది.
తెలంగాణ(Telangana)లో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు(Rains) కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా గత గురువారం(Thursday) నుంచి శనివారం(Saturday) వరకూ ప్రభుత్వం పాఠశాలల(Schools)ను మూసివేసింది. వర్షాలు తగ్గుముఖం పట్టకపోవడంతో ప్రభుత్వం మంగళవారం మరోసారి విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. బుధ(Wednesday), గురువారాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని సీఎం కేసీఆర్(CM KCR) నిర్ణయించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి(Sabitha Indrareddy)ని ఆదేశించారు. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలోనే పిల్లలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం ముందుస్తుగానే పాఠశాలలకు సెలవులు(Holidays) ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది.