పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ హాస్టల్‌కు(Government hostels) చెందిన ఓ బాలికతో నగ్నపూజలకు(Naked worship) ప్రయత్నించింది వంటమనిషి.

పేదరికాన్ని ఆసరాగా చేసుకుని ప్రభుత్వ హాస్టల్‌కు(Government hostels) చెందిన ఓ బాలికతో నగ్నపూజలకు(Naked worship) ప్రయత్నించింది వంటమనిషి. సోమవారం పెద్దపల్లి జిల్లా మంథని(Manthani) పట్టణంలోని బాలికల వసతి గృహంలో(girls hostel) జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పొరుగు జిల్లాకు చెందిన అక్కాచెల్లెళ్లు మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలికల వసతి గృహంలో ఉంటున్నారు. అదే హాస్టల్‌లో పని చేసే వంటమనిషి(Cook) అక్కాచెల్లెళ్లను చేరదీసినట్టు నటించింది. వారికి మాయమాటలు చెప్పింది. నగ్నపూజలు చేస్తే కనకవర్షం కురుస్తుందని పెద్దమ్మాయికి చెప్పింది. ఇకపై మీ కుటుంబం సంతోషంగా ఉండవచ్చని నమ్మబలికింది. వారం రోజుల కిందట ఆ వంటమనిషి తన పర్సనల్ గదికి ఓ వ్యక్తిని తీసుకొచ్చింది. బాలికలను పిలిపించి అతడి ఎదుట నగ్నంగా ఉంటే ప్రత్యేక పూజలు చేస్తారని చెప్పింది. ఆ మాట విన్న బాలిక హడలిపోయింది. భయంతో హాస్టల్‌ నుంచి వెళ్లిపోయి మంథని పట్టణంలో ఉన్న తమ బంధువుల ఇంటికి వెళ్లింది. నాలుగు రోజులుగా అక్కడే ఉంటున్నది. తల్లిదండ్రులకు విషయం తెలిసి కుటుంబసభ్యులు, బంధువులతో కలిసి హాస్టల్‌ దగ్గరకు వచ్చారు. వంటమనిషిని నిలదీశారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు వచ్చి ఘటనపై ఆరా తీశారు. వంట మనిషిని అదుపులో తీసుకున్నారు. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేశారు.

Eha Tv

Eha Tv

Next Story