గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో(Raja Singh) బీజేపీ(BJP) ఎలెక్షన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్(Etela Rajendhra) భేటీ అయ్యారు. భేటీ అనంతరం రాజాసింగ్ మాట్లాడుతూ.. ఇటీవల గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులపై, మహిళా కార్పోరేటర్‌పై పోలీసుల అక్రమ కేసులను ఈటెల, కిషన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు.
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌తో(Raja Singh) బీజేపీ(BJP) ఎలెక్షన్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్(Etela Rajendhra) భేటీ అయ్యారు. భేటీ అనంతరం రాజాసింగ్ మాట్లాడుతూ.. ఇటీవల గోషామహల్ నియోజకవర్గంలో బీజేపీ నాయకులపై, మహిళా కార్పోరేటర్‌పై పోలీసుల అక్రమ కేసులను ఈటెల, కిషన్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గోషామహల్ స్థానాన్ని బీఆర్ఎస్ గెలవాలని ఇటువంటి ఫేక్ కేసులు పెడుతూ ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. కార్యకర్తలను, కేడర్‌ను కాపాడుకోవాలని కిషన్ రెడ్డి, ఈటెల ఇటీవల చెప్పారు. అందులో భాగంగానే ఈ రోజు ఈటెల ఇక్కడకు వచ్చారని రాజాసింగ్ తెలిపారు.
ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్(BRS) ప్రభుత్వం బీజేపీ నాయకుల పట్ల కక్షపురితంగా వ్యవహరిస్తుందని అన్నారు. గోషామహల్ నియోజకవర్గంలో ఎలా అయినా గెలవాలని తమ కార్యకర్తలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన బాధ్యత మాపై ఉంది. బీజేపీ నాయకులపై నమోదైన కేసులపై పోలీస్ అధికారులతో మాట్లాడుతానని తెలిపారు. రాజాసింగ్ సస్పెన్షన్ వ్యవహారం కేంద్ర అధిష్టానం పరిధిలో ఉందని.. సస్పెన్షన్ ఎత్తివేత విషయంలో అధిష్టానం త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.