ఇకపై బంగారం(Gold) కొనుగోలు చేయాలంటే జ్యెవలరీ షాప్‌కు(Jwellery store) వెళ్లాల్సిన అవసరం లేదు. గోల్డ్ ఏటీఎంను(Gold ATMs) ఉపయోగించి బంగారు నాణేలను(Gold coins) తీసుకోవచ్చు. 0.5 గ్రాముల నుంచి 20 గ్రాముల వరకు బంగారాన్ని కొనుగోలు చేసే వెసులుబాటు ఉంటుంది. గోల్డ్ ఏటీఎంలో డెబిట్(Debit), క్రెడిట్(Credit) కార్డులు లేదా యూపీఐలు(UPI) ఉపయోగించి బంగారాన్ని కొనుక్కునే అవకాశాన్ని కల్పించారు. ఏటీఎంలోని స్క్రీన్‌పై ఆప్షన్ల ద్వారా బంగారు నాణేలు పొందే అవకాశాన్ని నిర్వాహకులు కల్పించారు. ఎంచుకున్న నాణేన్ని బట్టి, అందుకు అవసరమైన డబ్బులను డెబిట్, క్రెడిట్ లేదా యూపీఐల నుంచి చెల్లించాల్సి ఉంటుంది.

ఈ సదుపాయన్ని ఇప్పుడు అమీర్‌పేట్ మెట్రోస్టేషన్‌లో(Ameerpet metro Station) కల్పించారు. అమీర్‌పేట మెట్రోస్టేషన్ ఆవరణలో గోల్డ్ సిక్కా లిమిటెడ్ ఆధ్వర్యంలో గోల్డ్ ఏటీఎంను నిర్వాహకులు ప్రారంభించారు. బంగారు నాణేలు కొనేందుకు వచ్చే వినియోగదారులకు నాణ్యమైన బంగారాన్ని అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఒకప్పుడు నగదు, ఇతరత్రా లావాదేవీల కోసం కస్టమర్లు బ్యాంకులకు పరిగెత్తేవారు. నగదు, బంగారం దాచాలనుకుంటే బ్యాంకులనే ఆశ్రయించేవారు. ఏటీఎంలు వచ్చిన తర్వాత నగదును విత్‌డ్రా చేసుకునేందుకు, ఇతర ట్రాన్సాక్షన్ల కోసం కస్టమర్లు బ్యాంకులకు వెళ్లే అవసరం లేకుండా పోయింది. అయితే బంగారం కొనేందుకు మాత్రం బ్యాంకులు, జ్యువెలరీ షాపులను కస్టమర్లు ఆశ్రయించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. బంగారు ఏటీఎంలను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట మెట్రోస్టేషన్‌లో ఈ ఏటీఎంను ఏర్పాటు చేశారు. ఈ గోల్డ్ ఏటీఎం మెట్రోప్రయాణికులను ఆకర్షిస్తోంది. దీనిని చూసేందుకు ప్రయాణికులు ఎగబడుతున్నారు.