సెల్‌ఫోన్ (Cell Phone)చార్జింగ్(Charging) ఓ బాలిక ప్రాణాలను బలితీసుకుంది
Cell Phone Charging:బాలిక ప్రాణాలు తీసిన సెల్‌ఫోన్
సెల్‌ఫోన్ (Cell Phone)చార్జింగ్(Charging) ఓ బాలిక ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాదకరమన ఘటన ఖమ్మం (Khammam)జిల్లా చింతకాని(chintakani) మండలం మత్కేపల్లి నామవరంలో (Mathkepalli navaram)జరిగింది. తడి చేతులతో సెల్‌ఫోన్ చార్జింగ్ పెడుతూ కరెంట్ షాక్‌కు(Current Shock) గురై బాలిక చనిపోయింది. కటికాల రామకృష్ణ (Katikala Ramakrishna)దంపతులకు కూతురు అంజలి కార్తీక(Anjali Karthika) (9), కుమారుడు వెంకట గణేశ్ (venkata Ganesh)న్నారు. అయితే తండ్రి నుంచి అంజలి కార్తీక సెల్ ఫోన్ తీసుకుంది. మొబైల్‌లో చార్జింగ్ లేకపోవడంతో చార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నం చేసింది. కానీ తడి చేతులతో చార్జింగ్ పెడుతుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురికావడంతో విలవిల్లాడుతూ కుప్పకూలింది. దీంతో వెంటనే గమనించిన తల్లిదండ్రులు చేతులు, కాళ్లను రుద్దినా బాలిక నుంచి స్పర్శలేదు. దీంతో వెంటనే గ్రామంలోని ఓ ప్రైవేట్ డాక్టర్(Private Doctor) దగ్గిరిక తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన తర్వాత అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. బాలిక గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి(4th class) చదువుతోంది. బాలిక మృతితో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తండ్రి రామకృష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోలీసులు విచారిస్తున్నారు.