ఈ రాణి ప్రేమపురాణం, ఆ ముట్టడికైన ఖర్చులు.. వగైరాలు మనకు అక్కర్లేదంటాడు మహాకవి శ్రీశ్రీ..(Mahakavi sri sri) కాని ఈ రాణి ప్రేమపురాణం మాత్రం, ఆమె కోసం ప్రియుడు(Lover) పెట్టిన ఖర్చులు మనకు కావాలి. ఎందుకంటే ఇది వార్త కాబట్టి. ఆ వార్తలోనే(News) ఓ హెచ్చరిక ఉంది కాబట్టి. నల్లగొండ(Nalgonda) జిల్లా దేవరకొండకు(Devarakonda) చెందిన బూషరాజు రాణి అలియాస్ మేఘన ఈ స్టోరీలో ప్రధానపాత్ర. హనుమకొండకు చెందిన చెలుకపల్లి సుమన్(Suman) స్థానికంగా ఆప్టికల్స్ షాపులో పని చేస్తుంటాడు. నాలుగు నెలల కొందట మేఘన(Meghana) ఆ షాపుకు వచ్చింది. తనకు ఎవరూ లేరని, సమీపంలోని హాస్టల్‌లో ఉంటానని, పని కావాలని సుమన్‌తో ముచ్చట చెప్పింది
ఈ రాణి ప్రేమపురాణం, ఆ ముట్టడికైన ఖర్చులు.. వగైరాలు మనకు అక్కర్లేదంటాడు మహాకవి శ్రీశ్రీ..(Mahakavi sri sri) కాని ఈ రాణి ప్రేమపురాణం మాత్రం, ఆమె కోసం ప్రియుడు(Lover) పెట్టిన ఖర్చులు మనకు కావాలి. ఎందుకంటే ఇది వార్త కాబట్టి. ఆ వార్తలోనే(News) ఓ హెచ్చరిక ఉంది కాబట్టి. నల్లగొండ(Nalgonda) జిల్లా దేవరకొండకు(Devarakonda) చెందిన బూషరాజు రాణి అలియాస్ మేఘన ఈ స్టోరీలో ప్రధానపాత్ర. హనుమకొండకు చెందిన చెలుకపల్లి సుమన్(Suman) స్థానికంగా ఆప్టికల్స్ షాపులో పని చేస్తుంటాడు. నాలుగు నెలల కొందట మేఘన(Meghana) ఆ షాపుకు వచ్చింది. తనకు ఎవరూ లేరని, సమీపంలోని హాస్టల్‌లో ఉంటానని, పని కావాలని సుమన్‌తో ముచ్చట చెప్పింది. ప్రస్తుతానికి తన షాపులో పని లేదని సుమన్ చెప్పాడు. ఆమె వెళుతూ వెళుతూ సుమన్ ఫోన్ నంబర్(Phone number) తీసుకుని వెళ్లింది. ఇక అప్పట్నుంచి సుమన్‌కు తరచూ ఫోన్ చేసేది. అలా అతడికి కాసింత దగ్గరయ్యింది. ఓ రోజు సుమన్‌తో తన బాధ చెప్పుకుంది. మూడు నెలలుగా హాస్టల్ ఫీజు(Hostel fees) చెల్లించకపోవడంతో నిర్వాహకులు ఖాళీ చేయమంటున్నారని, సాయం చేయమని సుమన్‌ను కోరింది. పాపం సుమన్ ఆ హాస్టల్ ఫీజు కట్టాడు. తర్వాత అక్టోబర్ 28వ తేదీన తన పుట్టిన రోజు(Birthday) అని చెప్పి కొత్త బట్టల కోసం 35 వేల రూపాయలు సుమన్ దగ్గర్నుంచి తీసుకుంది. అటు పిమ్మట పెళ్లి చేసుకుందామని సుమన్‌తో చెప్పి ఓ బంగారు నగల షాపుకు(Jeweler shop) తీసుకెళ్లింది. మూడు లక్షల రూపాయల విలువైన వస్తువులను సుమన్‌తో కొనిపించింది. పెళ్లి రోజున తీసుకొస్తానని చెప్పి వాటిని తనతో పాటు తీసుకెళ్లింది. డిసెంబర్ 5వ తేదీ నుంచి ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్(Switchoff) అయ్యింది. ఆమె కోసం హాస్టల్‌కు వెళ్లాడు సుమన్. ఆమె హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోయిందని తెలిసి షాక్(Shock) అయ్యాడు. ఆమె ఊరికి వెళ్లి విచారించాడు. అప్పుడు సుమన్‌కు దిమ్మతిరిగే విషయాలు తెలిసాయి. రాణి అలియాస్ మేఘన ఇంతకు ముందు కూడా ఇలా రెండు పెళ్లిళ్లు(Marriages) చేసుకుంని, చాలా కాలంగా ఇంటికి రావడం లేదని ఆమె తల్లి చెప్పింది. తాను నిలువునా మునిగిపోయానని, ఆ నయవంచకి తనను దారుణంగా మోసం చేసిందని గ్రహించిన సుమన్ వెంటనే పోలీసులను(Police) ఆశ్రయించాడు. సుమన్ ఫిర్యాదును తీసుకున్న పోలీసులు విచారణ మొదలుపెట్టారు.