నల్లగొండ(Nalgonda)లోని బర్కత్ పురా(Barkatpura) కాలనీలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. న్యూ స్టార్ ఫ్రూట్స్ కంపెనీ(Star Fruit Company) కోల్డ్ స్టోరేజిలో ఏసీ గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా పేలింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మృతిచెందిన వారిని కోల్డ్ స్టోరేజి ఓనర్ షేక్ కలీమ్, అందులో పనిచేసే వ్యక్తి సాజిద్ గా గుర్తించారు. పేలుడు ధాటికి ఇద్దరు వ్యక్తుల శరీర భాగాలు చెల్లాచెదురయ్యాయి.

Breaking News
నల్లగొండ(Nalgonda)లోని బర్కత్ పురా(Barkatpura) కాలనీలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. న్యూ స్టార్ ఫ్రూట్స్ కంపెనీ(Star Fruit Company) కోల్డ్ స్టోరేజిలో ఏసీ గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా పేలింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మృతిచెందిన వారిని కోల్డ్ స్టోరేజి ఓనర్ షేక్ కలీమ్, అందులో పనిచేసే వ్యక్తి సాజిద్ గా గుర్తించారు. పేలుడు ధాటికి ఇద్దరు వ్యక్తుల శరీర భాగాలు చెల్లాచెదురయ్యాయి. పేలుడు జరిగిన సమయంలో అక్కడే ఉన్న మరో నలుగురు వ్యక్తులు.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నల్లగొండ ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, డీఎస్పీ నరసింహారెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా ఎస్పీ అపూర్వరావు కూడా ఘటన స్థలాన్ని సందర్శించనున్నారు.
