ఖమ్మం జిల్లా(Khammam District) వైరా నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం(BRS Public Meeting)లో పెను విషాదం చోటు చేసుకుంది. ఎవరో చేసిన పాపానికి ఓ నిండు ప్రాణాం బలయ్యింది. తొమ్మిది మంది క్షతగాత్రులయ్యారు. కారేపల్లి మండలం చీమలపాడులో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ నామా నాగేశ్వరరావు, వైరా ఎమ్మెల్యే రాములు నాయక్, ఇతర నేతలు పాల్గొన్నారు. వీరికి ఘనస్వాగతం పలుకుతూ పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చారు.
ఖమ్మం జిల్లా(Khammam District) వైరా నియోజకవర్గ బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనం(BRS Public Meeting)లో పెను విషాదం చోటు చేసుకుంది. ఎవరో చేసిన పాపానికి రెండు ప్రాణాలు బలయ్యాయి . తొమ్మిది మంది క్షతగాత్రులయ్యారు. కారేపల్లి మండలం చీమలపాడులో నిర్వహించిన బీఆర్‌ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో ఎంపీ నామా నాగేశ్వరరావు(Nama Nageswara Rao), వైరా ఎమ్మెల్యే రాములు నాయక్(wyra MLA Ramulu Nayak), ఇతర నేతలు పాల్గొన్నారు. వీరికి ఘనస్వాగతం పలుకుతూ పార్టీ కార్యకర్తలు బాణాసంచా కాల్చారు. ఇదే క్రమంలో ఓ తారాజువ్వ పక్కనే ఉనన గుడిసెపై పడింది. వెంటనే మంటలు అంటుకున్నాయి. మంటల ధాటికి గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్(Gas Cylinder) ఒక్కసారిగా పేలింది. ఈ దుర్ఘనలో ఒకరు చనిపోయారు. తొమ్మిది మందికి గాయాలయ్యాయి.
క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డవారిలో ఇద్దరు పోలీసులు, ఇద్దరు జర్నలిస్టులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు ఉన్నారు. పేలుడు ధాటికి పలువురు కాళ్లు, చేతులు తెగిపడ్డాయి.