ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ కౌంటరిచ్చారు. విద్యారంగంలో ఏపీకి ఒక్క అవార్డైన వచ్చిందా అంటూ నిలదీశారు. విద్యావ్యవస్థలో తెలంగాణ కేరళను మించి పోయిందన్నారు. తెచ్చుకున్న తెలంగాణపై ఆంధ్ర నాయకులు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Education Minister Botsa Satyanarayana)కు తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalakar) కౌంటరిచ్చారు. విద్యారంగంలో ఏపీకి ఒక్క అవార్డైన వచ్చిందా అంటూ నిలదీశారు. విద్యావ్యవస్థలో తెలంగాణ(Telangana) కేరళ(Kerala)ను మించి పోయిందన్నారు. తెచ్చుకున్న తెలంగాణపై ఆంధ్ర నాయకులు విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. అప్పటి కాంగ్రెస్ నాయకులే ఇప్పటి వైసీపీ(YCP) మంత్రులని అన్నారు. బోత్స సత్యనారాయణ విద్యా వ్యవస్థపై కామెంట్ చేసారు. కేంద్ర ప్రభుత్వమే తెలంగాణలో విద్యా విధానం బాగుందని మెచ్చుకుందని గుర్తుచేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో సరిపడా గురుకులాలు లేవు. 298 గురుకులాలు మాత్రమే ఉండేవి. ఉమ్మడి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ సరిగా లేదు. ఇప్పుడు తెలంగాణ లో 1,019. గురుకులాలు ఉన్నవి. 6,75,000 మంది విద్యార్థులు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో చదువుతున్నారు. ఒక్కోక్క విద్యార్థిపై లక్ష రూపాయల ఖర్చు తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తుందని వివరించారు. ఏపీలో ఇప్పటికీ 308 గురుకులాలు మాత్రమే ఉన్నవని.. 25, 000 మంది విద్యార్థులు మాత్రమే గురుకులాలో చదువుతున్నారని.. బొత్స సత్యనారాయణ నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావని ప్రశ్నించారు.
మా ముఖ్యమంత్రి పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) లో అవకతవకలు జరిగితే దొంగలని దొరకపట్టినారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు ఉద్యోగాలు అమ్ముకున్న చరిత్ర మీది. తెలంగాణ రాష్ట్రం సిద్దించాక ఆంధ్ర వారి కన్ను తెలంగాణ మీదనే ఉన్నది. తెలంగాణతో మీకేం పని ప్రశ్నించారు. తెలంగాణలో పైరవీలకి తావు లేదన్నారు. ఆంధ్ర నాయకులు మీ విద్యా విధానం చూసి సిగ్గుతో తలవంచుకోవాలి. దేశంలోనే అన్ని రంగాల్లో నంబర్ వన్ స్థానంలో తెలంగాణ ఉందని అన్నారు.
అంతకుముందు తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ట్రిపుల్ ఐటీ ప్రవేశాల ఫలితాలు విడుదల సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఏపీ విద్యా విధానాన్ని ఆప్ట్రాల్ తెలంగాణతో పోల్చి చూడటం సరికాదన్నారు. అక్కడంతా చూచి రాతలు, కుంభకోణాలు రోజూ చూస్తున్నామన్నారు. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణది. మన విధానం మనది.. మన ఆలోచనలు మనవి అని బొత్స వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు ఫైరవుతున్నారు.