వినాయకచవితి(vinayak chaturthi) నవరాత్రులలో లడ్డూ వేలం(Laddu auction) ఇప్పుడో ట్రెండ్‌ అయ్యింది.

వినాయకచవితి(vinayak chaturthi) నవరాత్రులలో లడ్డూ వేలం(Laddu auction) ఇప్పుడో ట్రెండ్‌ అయ్యింది. రెండు దశాబ్దాల కిందట లడ్డూ వేలం అన్నది లేదు. బాలాపూర్‌లో అంకురించిన లడ్డూ వేలం తంతు ఇప్పుడు మహావృక్షంగా మారింది. లడ్డూను సొంతం చేసుకోవడమన్నది ప్రిస్టేజియస్‌గా మారింది. లడ్డూ కోసం ఎంత సొమ్ము వెచ్చించడానికైనా సిద్ధంగా ఉంటున్నారు. హైదరాబాద్‌ బండ్లగూడ(Bandlaguda) జాగీర్‌లోని కీర్తి రిచ్‌మండ్‌ విల్లాస్‌లో(Keerthi Richmond Villas) నిర్వహించిన వేలంపాట రికార్డు సృష్టించింది. వేలం పాటలో ఏకంగా 1.87 కోట్ల రూపాయలు పలికింది. నిరుడు ఇదే ప్రాంతంలో నిర్వహించిన వేలంలో 1.20 కోట్ల రూపాయలకు లడ్డూను దక్కించుకోగా, ఆ రికార్డును బ్రేక్‌చేస్తూ ఈసారి దానిని మించి ధర పలకడం గమనార్హం. అంతకుముందు ఏడాది ఇక్కడ లడ్డూ ధర 60.80 లక్షల రూపాయలు పలికింది. కీర్తి రిచ్​మండ్​ విల్లాలో 11 ఏళ్లుగా వినాయకచవితి ఉత్సవాలను ఉత్సాహంగా నిర్వహిస్తూ వస్తున్నారు. చతుర్దశి రోజున వినాయక నిమజ్జనం ఉంటుంది. ఆ రోజునే ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి లడ్డూ వేలంపాట పాడుతారు. ఇందులో విల్లాలో ఉన్నవారు మాత్రమే పాల్గొంటారు. లడ్డూ ఎవరికి దక్కినా అందరూ కలిసి సేవా కార్యాక్రమాల కోసం ఆ డబ్బును వినియోగిస్తారు. ఒక్క రూపాయి కూడా వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించుకోకపోవడం విశేషం.

Eha Tv

Eha Tv

Next Story