యువతుల బలహీనతలే అతనికి ఆయుధం. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ చూడగానే మనోడి ఫొటోలు దర్శనమిస్తాయి.

యువతుల బలహీనతలే అతనికి ఆయుధం. మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ చూడగానే మనోడి ఫొటోలు దర్శనమిస్తాయి. డిఫరెంట్ ఫోజెస్‌తో దిగిన పిక్స్ పెట్టి ఆకర్షణీయమైన ప్రకటనలు చేస్తాడు. సరే కదా అని సంప్రదిస్తే తియ్యగా మాటలు కలుపుతాడు. ఆపై పరిచయం.. డబ్బులు తీసుకొని మోసం చేస్తాడు. ఇట్లా ఒకటి, రెండు కాదు.. 50 మంది యువతుల తల్లిదండ్రులను తన తియ్యటి మాటలు చెప్పి మోసగించాడు. చూస్తే విగ్గు రాజా(Viggu Raja) కానీ చేసే పని ఇది. ఈ విగ్గురాజా వంశీకృష్ణ(Vamshi Krishna) కోసం గచ్చిబౌలి పోలీసులు గాలింపు చేపట్టారు. తాజాగా ఓ మహిళా డాక్టర్‌ను మోసం చేసిన ఘటనలతో ఆమె తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు మనోడి హిస్టరీని సెర్చ్ చేయగా ఎగ్జిస్టెన్స్ ఖైదీగా తేలింది. విగ్గులు మార్చి ఫొటోలు పెడుతూ అమ్మాయిల తల్లిదండ్రులను మోసిం చేసినట్లు విచారణలో వెల్లడైంది. ఓ మహిళను తన అందమైన ప్రకటనలతో బుట్టలో వేసుకొనని ఆమె తండ్రి ద్వారా దాదాపు 40 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లుకు డబ్బు వాపస్ అడిగితే మహిళా డాక్టర్ ఫొటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్మెయిల్ చేశాడు. దీంతో ఆమె సైబర్‌క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించగా.. ఆ నిత్య పెళ్లికొడుకు మోసాలను పోలీసులు గుర్తించి విగ్గురాజా కోసం గాలింపు చేపట్టారు.

ehatv

ehatv

Next Story