దేశంలోనే తొలిసారిగా డిజిటల్‎వాలెట్ ని రూపొందించిన రాష్ట్రంగా తెలంగాణ ప్రసంశలు అందుకుంటుంది .అభివృద్ధి దిశలో అడుగులువేస్తున్న తెలంగాణ జాబితాలో ఈ ఘనత సుస్థిరం అని చెప్పుకోవచ్చు . మొట్టమొదటిసారి ప్రభుత్వంరూపొందించిన టీ -వాలెట్ ఇప్పుడు జీ 20 సదస్సులో ప్రశంసలు అందుకుంది . ప్రజలు సాధారణంగా వినియోగించే పలురకాల చెల్లింపులకు ఈ డిజిటల్‎వాలెట్ఎంతగానో ఉపయోగపడుతోంది.టీ- వాలెట్ పేరుతో అందుబాటులోకి ఈ డిజిటల్ పేమెంట్ నెట్‎వర్క్‎కు క్రమంగా ఆదరణ పెరుగుతువచ్చింది. 2017లో ప్రారంభించిన ఈ డిజిటల్ వాలెట్ 1.39 […]

దేశంలోనే తొలిసారిగా డిజిటల్‎వాలెట్ ని రూపొందించిన రాష్ట్రంగా తెలంగాణ ప్రసంశలు అందుకుంటుంది .అభివృద్ధి దిశలో అడుగులువేస్తున్న తెలంగాణ జాబితాలో ఈ ఘనత సుస్థిరం అని చెప్పుకోవచ్చు . మొట్టమొదటిసారి ప్రభుత్వంరూపొందించిన టీ -వాలెట్ ఇప్పుడు జీ 20 సదస్సులో ప్రశంసలు అందుకుంది .

ప్రజలు సాధారణంగా వినియోగించే పలురకాల చెల్లింపులకు ఈ డిజిటల్‎వాలెట్ఎంతగానో ఉపయోగపడుతోంది.టీ- వాలెట్ పేరుతో అందుబాటులోకి ఈ డిజిటల్ పేమెంట్ నెట్‎వర్క్‎కు క్రమంగా ఆదరణ పెరుగుతువచ్చింది. 2017లో ప్రారంభించిన ఈ డిజిటల్ వాలెట్ 1.39 మిలియన్‌ సబ్‌స్క్రైబర్లు సొంతం చేసుకోవటమే కాకుండా ..35 మిలియన్‌ లావాదేవీలు ఇప్పటివరకు నమోదు చేసింది.ఈ వాలెట్ ద్వారా 1,169 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ నుండైనా డిజిటల్‎వాలెట్ పద్దతి ద్వారా చెల్లింపులు జరిపే అవకాశం ఉంది. 2017లో మంత్రి కేటీఆర్ ప్రారంభించిన టీ -వాలెట్ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్నారు.ప్రస్తుతం upi ద్వారా చెల్లింపులు జరిపే విధానాలు ఎన్ని ఉన్నపటికీ ప్రభుత్వం రూపొందించినటీ -వాలెట్‎కి గ్రామీణ స్థాయి నుండి విశేష ఆదరణ రావటం ప్రశంసనీయమైనది. ప్రభుత్వం మంజూరు చేసే అన్ని పథకాలకు సంబందించిన ప్రయోజనాలు టీ -వాలెట్ ద్వారానే పొందాల్సి ఉంటుంది. కాబట్టి గ్రామాల్లో సైతం ట్-వాలెట్ కు మంచి ఆదరణ లభించింది . రేషన్ దుకాణాల్లో సైతం టీ -వాలెట్ ఉపయోగిస్తున్నారు . స్త్రీనిధి రుణాలు..ఆసరా పెన్షన్ల చెల్లింపులు వంటి ప్రభుత్వ - పథకాల చెల్లింపుల్లో టీ -వాలెట్ కీలకంగా మారింది.

క్యూఆర్ కోడ్‌ను స్కాన్ లేదా కార్డును స్వైప్ చేయడం ద్వారా చెల్లింపులు చేసే విధంగా సెక్యూరిటీ పరంగానూ జాగ్రత్తలు పటిష్టంగా తీసుకున్నారు . రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు స్కాలర్‌షిప్‌ విధానం కోసం కూడా టీ -వాలెట్ ని వినియోగిస్తుంది. విద్యార్థులు బ్యాంక్ ఖాతా ద్వారా కాకుండా నేరుగా వాలెట్‌ని ఉపయోగించి డబ్బు డ్రా చేసుకునేందుకు వీలుగా నగదు విత్‌డ్రాలను సులభతరం చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చింది.

ఎటువంటి సర్వీస్‌ చార్జీ లేకుండానే ఏదైనా బ్యాంకుఖాతాకు నగదుబదిలీ చేసుకోవచ్చని,టీ వాలెట్‌ ద్వారా ప్రజలకు బ్యాంకింగ్‌ సేవలను చేరువ చేసిన విధానంపై జీ-20 దేశాల ఆర్థిక సదస్సులో రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌ వివరించారు.మారుమూల పల్లెల్లో సైతం ట్-వాలెట్ అందుబాటులో ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌సేథ్‌తోపాటు 40 దేశాల ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన డిజిటల్ పేమెంట్ వాలెట్ పైన ఆసక్తికర చర్చ జరిగింది. దీనితో తెలంగాణ ప్రభుత్వం సాధించిన పురోగతిలో ఈ టీ -వాలెట్ కీలక ఘట్టంగా జీ-20 దేశాల ఆర్థిక సదస్సులో ప్రశంసలు అందుకుంది .

Updated On 7 March 2023 12:49 AM GMT
Ehatv

Ehatv

Next Story