జూన్ 30 నుంచి గిరిజనులకు(Tribal) పోడు భూముల పట్టాలను(Waste lands Documents) పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్‌(CM KCR) నిర్ణయించిన‌ట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. జూన్ 30న అసిఫాబాద్(Asifabad) జిల్లా కేంద్రం నుండి పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

జూన్ 30 నుంచి గిరిజనులకు(Tribal) పోడు భూముల పట్టాలను(Waste lands Documents) పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్‌(CM KCR) నిర్ణయించిన‌ట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. జూన్ 30న అసిఫాబాద్(Asifabad) జిల్లా కేంద్రం నుండి పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించనున్నట్లు ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. మంత్రులు(Ministers), ఎమ్మెల్యేలు(MLA) వారి వారి జిల్లాలు, నియోజకవర్గాల్లో(constituencies) అదే రోజు పోడు పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్నట్లు వెల్ల‌డించింది.

ముందుగా పట్టాల పంపిణీ ఈ నెల 24 నుంచే ప్రారంభించాలని ప్రకటించినప్పటికీ.. కొన్ని అనివార్య కారణాల వ‌ల్ల‌ ఈనెల 30వ తేదికి మార్చవలసి వచ్చిందని వివ‌రించింది. జాతీయ ఎన్నికల కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తుండడం.. అందుకు సంబంధించి రెండు రోజులుగా జిల్లా కలెక్టర్లకు శిక్షణా తరగుతులు నిర్వహస్తుండడం, ఈ నెల 29న బక్రీద్ పండుగ ఉంటం వంటి కారణాల రీత్యా ముందుగా ప్రకటించిన కార్యక్రమాన్ని జూన్ 30వ తేదీకి వాయిదా వేయడం జరిగిందని వెల్ల‌డించింది.

Updated On 24 Jun 2023 6:06 AM GMT
Ehatv

Ehatv

Next Story