జాతరలో సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు భక్తులకు ఉచిత వైఫై సేవలందించనుంది

సమ్మక్క సారలమ్మ మహాజాతర కోసం మేడారంలో ప్రభుత్వం పలు ఏర్పాట్లను చేస్తూ ఉంది. ప్రతి రెండేండ్లకోసారి నిర్వహించే జాతరకు ఇంకొద్దిరోజులే గడువు ఉండటంతో ఏర్పాట్లను మరింత ముమ్మరం చేసింది. ఫిబ్రవరి21 నుంచి 24వ తేదీ వరకు జరిగే జాతరకు కోటిన్నర వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క ఏర్పాట్లను పర్యవేక్షించారు. మహాలక్ష్మి స్కీం కింద పల్లెవెలుగు, ఎక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ప్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బస్సుల్లో జాతరకు వచ్చే మహిళలకు ప్రభుత్వం ఫ్రీ జర్నీ వసతి కల్పిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 6 వేల బస్సుల్లో సుమారు 40 లక్షల మంది భక్తులను తీసుకురావడమే తమ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేతృత్వంలో ఇప్పటికే మేడారంలో 50 ఎకరాల్లో తాత్కాలిక బస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్టేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు చేశారు. 47 క్యూలైన్లు నిర్మించారు. ఆర్టీసీ ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2.25 కోట్లు ఖర్చు చేస్తోంది. బస్సుల్లో వచ్చే భక్తులు గద్దెలకు అర కిలోమీటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దూరందాకా చేరుకోవచ్చు. ఫిబ్రవరి 18 నుంచి 25వ తేదీ వరకు ఆర్టీసీ బస్సులు నడపనున్నారు.

ప్రభుత్వరంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) మేడారం మహాజాతరలో మెరుగైన సేవలందించేందుకు సిద్ధమైంది. జాతరలో సిగ్నలింగ్ వ్యవస్థను పటిష్టం చేయడంతో పాటు భక్తులకు ఉచిత వైఫై సేవలందించనుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే 16 ప్రధాన ప్రాంతాల్లో అక్కడి జనాలంతా ఉచితంగా వైఫై సేవలు వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తోంది. ములుగు ఎంట్రన్స్ లోని గట్టమ్మ గుడి, కొత్తూరు రోడ్‌, కొత్తూరు స్కూల్‌, ఊరట్టం క్రాస్ రోడ్డు, కాజ్‌వే, రెడ్డిగూడెం స్కూల్‌, హరిత హోటల్‌, నార్లాపూర్‌, ఇంగ్లిష్‌ మీడియం స్కూల్‌, ఐటీడీఏ గెస్ట్‌ హౌస్‌, బస్టాండ్‌, వాచ్‌ టవర్‌, ఆసుపత్రుల వద్ద ఒక్కొక్కటి, జంపన్నవాగు, ఆర్టీసీ బస్టాండ్‌, మేడారం అమ్మవారి గద్దెల ప్రాంతాల్లో హాట్‌ స్పాట్‌లు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టారు.

Updated On 6 Feb 2024 12:51 AM GMT
Yagnik

Yagnik

Next Story