పెండింగ్ చలాన్లను (pending challans) క్లియర్ చేయడానికి తెలంగాణ సర్కారు (telangana governament)భారీ రాయితీ (discounts)ప్రకటించింది కదా! దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్నారు సైబర్ కేటుగాళ్లు (Cyber criminals). ఫేక్ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసి వాహనదారులను మోసం(cheating) చేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. www.echallantspolice.in పేరుతో సైబర్ మోసగాళ్లు ఫేక్ వెబ్‌సైట్ సృష్టించారు.
పెండింగ్ చలాన్లను (pending challans) క్లియర్ చేయడానికి తెలంగాణ సర్కారు (telangana governament)భారీ రాయితీ (discounts)ప్రకటించింది కదా! దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్నారు సైబర్ కేటుగాళ్లు (Cybercriminals). ఫేక్ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసి వాహనదారులను మోసం(cheating) చేస్తున్నారు. అందినకాడికి దోచుకుంటున్నారు. www.echallantspolice.in పేరుతో సైబర్ మోసగాళ్లు ఫేక్ వెబ్‌సైట్ సృష్టించారు. ఈ సైట్‌లో పేమెంట్ చేయొద్దని, www.echallan.tspolice.gov.in/publicview వెబ్‌సైట్‌లో మాత్రమే నగదు పే చేయాలని పోలీసులు స్పష్టం చేశారు. అలాగే పేటీఎం, మీ-సేవా సెంటర్లలో పెండింగ్ చలాన్స్ క్లియర్ చేసుకోవచ్చని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ప్రకటించిన రాయితీ ఆఫర్‌కు భారీ స్పందన వస్తోంది. చాలా మంది పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకుంటున్నారు. ఈ నెద 10వ తేదీ వరకు ఈ ఆఫర్ కొనసాగుతుంది. దీనిపై దృష్టి పెట్టిన సైబర్ క్రిమినల్స్ నకిలీ వెబ్‌సైట్ ద్వారా చలాన్లు వసూలు చేస్తున్నారు. వాహనదారులను మోసం చేస్తున్నారు. నకిలీ వెబ్‌సైట్‌ను క్రియేట్ చేసిన వారి కోసం సైబర్ క్రైమ్ పోలీసులు వెతుకుతున్నారు.