Auspicious Day For Nominations : ఆ నాలుగు రోజులు బ్రహ్మండంగా ఉన్నాయట!
మన రాజకీయ నాయకులకు(Politicians) బోల్డంత సెంటిమెంట్ ఉంటుంది. ఎన్నికల బరిలో దిగే నేతలకు మరింత ఎక్కువగా ఉంటుంది. నామినేషన్ల దగ్గర్నుంచి ప్రమాణ స్వీకారం వరకు అన్నింటికీ మంచి ముహూర్తాలనే చూసుకుంటారు. ఆ సుముహూర్తాలను అనుసరిస్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్(Election Schedule) రాగానే మన నేతలు పండితుల దగ్గరకు పరుగులుపెడుతున్నారు. అప్పుడే నామినేషన్ల ముహూర్తాలు ఖరారు చేసుకుంటున్నారు. తమ ఆస్థాన పండితులతో సంప్రదింపులు జరుపుతున్నారు.
మన రాజకీయ నాయకులకు(Politicians) బోల్డంత సెంటిమెంట్ ఉంటుంది. ఎన్నికల బరిలో దిగే నేతలకు మరింత ఎక్కువగా ఉంటుంది. నామినేషన్ల దగ్గర్నుంచి ప్రమాణ స్వీకారం వరకు అన్నింటికీ మంచి ముహూర్తాలనే చూసుకుంటారు. ఆ సుముహూర్తాలను అనుసరిస్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్(Election Schedule) రాగానే మన నేతలు పండితుల దగ్గరకు పరుగులుపెడుతున్నారు. అప్పుడే నామినేషన్ల ముహూర్తాలు ఖరారు చేసుకుంటున్నారు. తమ ఆస్థాన పండితులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఏ రోజున నామినేషన్(Nominations) వేస్తే బాగుంటుందో జాతకం చూసి చెప్పమని వేడుకుంటున్నారు.
నవంబర్ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ ఎనిమిది రోజులలో నాలుగు రోజులు మాత్రమే తిథి, నక్షత్ర బలం రీత్యా కీలకంగా ఉన్నాయి. ఈ నాలుగు రోజుల్లోనే ఎక్కువ మంది నాయకులు నామినేషన్లు వేసే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
నవంబర్ 9వ తేదీ బ్రహ్మండంగా ఉందని అంటున్నారు పండితులు. విష్ణు తిథిగా చెప్పుకునే ఏకాదశి కావడం, పైగా ఉత్తర నక్షత్రంతో కూడిన గురువారం కావడంతో చాలా మందికి ఇది కలిసిరావచ్చని చెబుతున్నారు.
ముహూర్తం బాగుంది కాబట్టే ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) కూడా అదే రోజున నామినేషన్ దాఖలు చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నామినేషన్ల ఘట్టం ముగియడానికి సరిగ్గా ఇది ముందురోజు కావడం విశేషం.నవంబర్ 8వ తేదీ కూడా దివ్యమైన ముహూర్తమే! పుబ్బ నక్షత్రంతో కూడిన బుధవారం. దశమి తిథి. గురు, కుజ బలం బాగా ఉన్న రోజని పంచాంగం అంటోంది. ధన బలం కూడా ఎక్కువగా ఉన్న రోజుగా పండితులు చెబుతున్నారు.
ఈ రోజున కూడా నామినేషన్ వేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతారన్నది పండితుల భావన.
సుముహూర్తాల వరుసలో నవంబర్ 3వ తేదీ మూడో స్థానంలో ఉంటుంది. భారతీయుల ఆరాధ్యదైవం శ్రీరాముడి జన్మ నక్షత్రం అయిన పునర్వసు ఉన్న శుక్రవారం రోజుది! అందుకే ఆ రోజుకు ఎంతో ప్రాధాన్యం ఉందని పండితులు చెబుతున్నారు. నామినేషన్ల పర్వం తొలి రోజు అయిన మూడో తేదీన ముస్లింలు కూడా ఆసక్తి చూపే అవకాశం ఉంది. అందుకు కారణం వారు పవిత్రంగా భావించే శుక్రవారం కావడమే!
నవంబర్ 4వ తేదీ సప్తమి తిథితో కూడిన శనివారం. ఆ రోజున పునర్వసు-పుష్యమి నక్షత్రాలు ఎంతో ప్రభావం చూపుతున్నాయి. ఇలా ఈ రెండు తిథులు కలిసి ఉండటం మహారాజయోగంగా భావిస్తారు. ఈ నాలుగు రోజుల్లోనే ఎక్కువ మంది నామినేషన్లు వేసే అవకాశం ఉందని, ఈ మేరకు ఇప్పటికే నాయకులు వివరాలు తెలుసుకుని ముహూర్తాలను ఖాయ చేసుకున్నారని పండితులు చెబుతున్నారు. ముహూర్తాల సంగతి పక్కన పెడితే కొందరు మంగళవారం మంగళకరమైన రోజుగా భావిస్తారు. ఆ రోజున పనులు మొదలుపెట్టేందుకు ఇష్టపడతారు.
ఆ లెక్కన మంగళవారం రోజున కొందరు నామినేషన్లు వేసే అవకాశం ఉంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న ఇద్దరు మంత్రులు, వికారాబాద్ జిల్లాకు చెందిన ఓ నేత, బీజేపీ కీలక నేత, బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి చేరిన ఓ సీనియర్ నేత, ధనికవర్గాలు ఎక్కువ ఉన్న నియోజకవర్గానికి చెందిన నేత.... ఇలా కొందరు మంగళవారానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. పంచాగం చూసి ముహూర్తాలు ఎప్పే పండితుల దగ్గర్నుంచి చేయి చూసి జోస్యం చెప్పే జ్యోతిష్కుల వరకు అందరూ ఈ నెల రోజులు బిజీగా ఉంటారు.
ఇప్పటికే తమ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉందో చెప్పమంటూ పండితుల దగ్గరకు పరుగులు పెడుతున్నారు నేతలు. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ మంత్రికి ఈసారి ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయట! జన్మనక్షత్రం ప్రకారం అనుకూల యోగం లేదని తెలుసుకున్న సదరు నేత పరిహార పూజలు మొదలుపెట్టారట! కుటుంబమంతా పరిహార పూజల్లో పాల్గొంటున్నదట! అలాగే బీఆర్‌ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్లిన ఓ నాయకుడి తరపున ఆయన భార్య పూజల్లో నిమగ్నమయ్యారట!