బీఆర్ఎస్‌కు(BRS) కోకాపేటలో(Kokapet) 11 ఎకరాల భూ కేటాయింపుపై హైకోర్టులో పిల్(High court PIL) దాఖ‌లైంది. బీఆర్ఎస్‌కు భూకేటాయింపుపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(Forum for Good Governance) ఈ పిల్ దాఖ‌లు చేసింది. కోకాపేటలో ఖరీదైన భూమిని బీఆర్ఎస్‌ పార్టీ కార్యాయలం కోసం కేటాయించారని పిల్ లో పేర్కొంది. ఎకరానికి(acre) రూ.50కోట్ల విలువైన భూమిని రూ.3.41కోట్లకే కేటాయించారని పిటీషనర్ పిల్‌లో పేర్కొన్నారు.

బీఆర్ఎస్‌కు(BRS) కోకాపేటలో(Kokapet) 11 ఎకరాల భూ కేటాయింపుపై హైకోర్టులో పిల్(High court PIL) దాఖ‌లైంది. బీఆర్ఎస్‌కు భూకేటాయింపుపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(Forum for Good Governance) ఈ పిల్ దాఖ‌లు చేసింది. కోకాపేటలో ఖరీదైన భూమిని బీఆర్ఎస్‌ పార్టీ కార్యాయలం కోసం కేటాయించారని పిల్ లో పేర్కొంది. ఎకరానికి(acre) రూ.50కోట్ల విలువైన భూమిని రూ.3.41కోట్లకే కేటాయించారని పిటీషనర్ పిల్‌లో పేర్కొన్నారు. అయిదు రోజుల్లో ఆ భూకేటాయింపు ప్రక్రియను పూర్తి చేశారన్న ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్.. భూకేటాయింపు డాక్యుమెంట్లన్నీ(documents) రహస్యంగా పెట్టారని పిల్‌లో పేర్కొంది.

శిక్షణ, ఎక్సలెన్స్ కేంద్రం పేరిట బీఆర్ఎస్‌ భూమి పొందిందని పిటీషనర్ పిల్‌లో వెల్ల‌డించారు. బీఆర్ఎస్‌కు బంజారాహిల్స్(Banjara Hills ) లో పార్టీ కార్యాలయం(Party Office) ఉన్నప్పటికీ.. మళ్లీ భూమి కేటాయించారని వివ‌రించారు. బీఆర్ఎస్‌కు భూకేటాయించిన జీవోను రద్దు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్‌లో కోరింది. కోకాపేటలో నిర్మాణ పనులు జరపకుండా స్టే ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్‌లో కోరింది.

Updated On 11 July 2023 3:09 AM GMT
Ehatv

Ehatv

Next Story