మాజీ పీసీసీ అధ్యక్షుడు, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నర్సారెడ్డి సోమవారం ఉదయం కన్నుమూశారు. నర్సారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా 1972 నుంచి రెండేళ్ల పాటు పని చేసారు.
మాజీ పీసీసీ అధ్యక్షుడు(PCC President), సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నర్సారెడ్డి(Narsa Reddy) సోమవారం ఉదయం కన్నుమూశారు. నర్సారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా 1972 నుంచి రెండేళ్ల పాటు పని చేసారు. ఎంపీ(MP)గా, ఎమ్మెల్యే(MLA)గా, ఎమ్మెల్సీ(MLC)గా పని చేసిన నర్సారెడ్డి.. జలగం వెంగళరావు(Jalagam Vengalrao) మంత్రి వర్గంలో రెవెన్యూ శాఖ మంత్రి(Revenue Minister)గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. నిర్మల్(Nirmal) కు చెందిన నర్సారెడ్డి ప్రస్తుతం బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12 లో మంత్రుల నివాస సముదాయానికి దగ్గర్లో ఉన్న వైట్ హౌస్(White House)లో నివాసం ఉంటున్నారు.
నర్సారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సంతాపం వ్యక్తం చేశారు. ఎంపీగా, ఎమ్మెల్యే గా, ఎమ్మెల్సీ గా ప్రజలకు ఆయన అనేక సేవలందించారని గుర్తుచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడుగా, మంత్రిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. ఆయన అనుభవాలు మాకు మార్గదర్శకంగా ఉండేవన్నారు. ఆయన మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని విచారం వ్యక్తం చేశారు.