బీజేపీ(BJP) నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి(Vijayashanthi) మరో ఆసక్తికరమైన ట్వీట్(Tweet) చేశారు. ఈసారి పార్టీ మారాలనే సూచనలపై క్లారిటీ ఇచ్చారు. సినిమాల్లోలాగా రాజకీయాలలో ద్విపాత్రాభినయం సాధ్యం కాదని విజయశాంతి అభిప్రాయపడ్డారు.

బీజేపీ(BJP) నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి(Vijayashanthi) మరో ఆసక్తికరమైన ట్వీట్(Tweet) చేశారు. ఈసారి పార్టీ మారాలనే సూచనలపై క్లారిటీ ఇచ్చారు. సినిమాల్లోలాగా రాజకీయాలలో ద్విపాత్రాభినయం సాధ్యం కాదని విజయశాంతి అభిప్రాయపడ్డారు. బీఆర్‌ఎస్‌(BRS) నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకోవడానికి కాంగ్రెస్‌(Congress) నుంచి పోరాడాలని కొందరు, బీజేపీ(BJP) వైపు నిలబడాలని మరికొందరు చెబుతున్నారు. ఈ రెండు అభిప్రాయాలు కూడా కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ మేలు కోసమేనని విజయశాంతి చెబుతూ అయినా సినిమాల తీరుగా పోలీసు లాకప్‌, రౌడీ దర్బార్‌, నాయుడమ్మ తరహాలో ద్విపాత్రాభినయం చేసే అవకాశం రాజకీయాలలో సాధ్యపడదని చెప్పారు. ఏదైనా ఒక పార్టీకి మాత్రమే పని చేయగమని విజయశాంతి పేర్కొన్నారు.

Updated On 2 Nov 2023 12:31 AM GMT
Ehatv

Ehatv

Next Story