మాజీ ఎమ్మెల్యే, మాజీ రాజ్యసభ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ రామచంద్రారెడ్డి స్వస్థలం. తొలితరం కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తితో ఆయన తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. స్వగ్రామం చిట్టాపూర్ సర్పంచ్ గా, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా, మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా, దొమ్మాట శాసనసభ్యునిగా ఆయన సేవలందించారు.
మాజీ ఎమ్మెల్యే, మాజీ రాజ్యసభ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి(Solipeta Ramachandra Reddy) మంగళవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 92 సంవత్సరాలు. సిద్దిపేట(Siddipet) జిల్లా చిట్టాపూర్(Chittapur) రామచంద్రారెడ్డి స్వస్థలం. తొలితరం కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తితో ఆయన తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. స్వగ్రామం చిట్టాపూర్ సర్పంచ్ గా, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా, మెదక్ జిల్లా(Medak District) కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా, దొమ్మాట(Dommata) శాసనసభ్యునిగా ఆయన సేవలందించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యునిగా పలు హోదాల్లో విశిష్ట సేవలు అందించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన భౌతికకాయాన్ని సందర్శనార్ధం వారి నివాసం బంజారాహిల్స్(Banjara Hills) ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉంచారు. ఈ సాయంత్రం నాలుగు గంటలకు ఫిలింనగర్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు జరుగుతాయి.
మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మరణం పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు(CM KCR) సంతాపాన్ని ప్రకటించారు. తొలితరం కమ్యూనిస్టు నేతగా, నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న సోలిపేట జీవితం ఆదర్శవంతమైనది అని సీఎం తెలిపారు. తన రాజకీయ జీవితంలో సర్పంచి స్థాయి నుంచి ఎమ్మెల్యే(MLA)గా, ఎంపీ(MP)గా ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన క్రమం రేపటి తరానికి స్ఫూర్తిదాయకమని సీఎం అన్నారు.
సిద్దిపేట ప్రాంత వాసిగా, రాజకీయ, సామాజిక రంగాల్లో సోలిపేట ఆచరించిన కార్యాచరణ, ప్రజా జీవితంలో కొనసాగుతున్న తమ లాంటి ఎందరో నేతలకు ప్రేరణగా నిలిచిందన్నారు. సోలిపేట రామచంద్రారెడ్డి మరణంతో.. తెలంగాణ(Telangana) మరో తొలి తరం ప్రజానేతను కోల్పోయిందన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.