భువనగిరి(Bhuvanagiri) మాజీ ఎంపీ భూర నర్సయ్య గౌడ్‌కు(Bhura Narsaiah Goud) చేదు అనుభవం ఎదురైంది. నర్సయ్య గౌడ్ గతంలో బీఆర్ఎస్(BRS) పార్టీలో ఉండగా.. ఇప్పుడు బీజేపీ(BJP) పార్టీలో చేరారు. అయితే.. నర్సయ్య గౌడ్ బీజేపీ కార్యకర్తలతో కలిసి అబ్దుల్లాపూర్(Abdullahpur) మెట్ మండలంలోని పలు గ్రామాల్లో వరద ముంపు ప్రాంతాలను పర్యటించారు.
భువనగిరి(Bhuvanagiri) మాజీ ఎంపీ భూర నర్సయ్య గౌడ్‌కు(Bhura Narsaiah Goud) చేదు అనుభవం ఎదురైంది. నర్సయ్య గౌడ్ గతంలో బీఆర్ఎస్(BRS) పార్టీలో ఉండగా.. ఇప్పుడు బీజేపీ(BJP) పార్టీలో చేరారు. అయితే.. నర్సయ్య గౌడ్ బీజేపీ కార్యకర్తలతో కలిసి అబ్దుల్లాపూర్(Abdullahpur) మెట్ మండలంలోని పలు గ్రామాల్లో వరద ముంపు ప్రాంతాలను పర్యటించారు. ఈ క్రమంలో నర్సయ్య లష్కర్ గూడా గ్రామానికి వెళ్లారు. అయితే అక్కడ గ్రామస్తులు నర్సయ్యను అడ్డుకున్నారు. ఆ సమయంలో అక్కడ బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. నర్సయ్యను గ్రామస్తులు అడ్డుకోవడంతో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీ గా ఉన్నా సమయంలో ఏమాత్రం పట్టించుకోని నర్సయ్య.. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడం ఏంటి అని గ్రామస్తులు ప్రశ్నించారు. దీంతో గ్రామస్తులు, బీజేపీ కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలోనే బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.