మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకురాలు కుంజా సత్యవతి క‌న్నుమూశారు. భద్రాచలం లోని ఆమె నివాసంలో తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో హాస్పిటల్ కు తరలిస్తుండగా మృతి చెందింది. ఆమె మృతి పట్ల ప‌లువురు నాయ‌కులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు

మాజీ ఎమ్మెల్యే, బీజేపీ(BJP) నాయకురాలు కుంజా సత్యవతి(Kunja Satyavati) క‌న్నుమూశారు. భద్రాచలం(Bhadrachalam) లోని ఆమె నివాసంలో తీవ్రమైన ఛాతీ నొప్పి(Chest Pain) రావడంతో హాస్పిటల్ కు తరలిస్తుండగా మృతి చెందింది. ఆమె మృతి పట్ల ప‌లువురు నాయ‌కులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. కుంజా సత్యవతి మృతిపట్ల భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య(Podem Veeraiah), పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు(Payam Venkateshwarlu), మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Thummala Nageshwar Rao) సంతాపం వ్యక్తం చేశారు. 2009 నుంచి 2014 వరకు అసెంబ్లీలో అనేక అంశాలను లేవనెత్తి జిల్లాకు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన విషయాన్ని తుమ్మల గుర్తు చేసుకున్నారు.

కుంజా సత్యవతి దంపతులు మొదట్లో సీపీఎం(CPM) పార్టీలో ప‌నిచేశారు. ఆ తర్వాత వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి(YS Rajashekar Reddy) చొరవతో కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో చేరారు. 2009 ఎన్నికల్లో భద్రాచలం నుంచి సత్యవతి కాంగ్రెస్ టికెట్ పై గెలిచారు. వైఎస్ మరణానంతర జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆ తరువాత వైసీపీ(YSRCP)లోకి వెళ్లారు. ఆ తరువాత మళ్లీ కాంగ్రెస్ లోకి వెళ్లిన వారు.. ఆపై బీజేపీ(BJP)లో చేరారు.

Updated On 15 Oct 2023 9:25 PM GMT
Yagnik

Yagnik

Next Story