మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి కన్నుమూశారు. మహబూబ్నగర్ జిల్లా రాజకీయాలలో కొత్తకోట దయాకర్ రెడ్డి తనదైన ముద్ర వేశారు. రాజకీయ ఆరంగ్రేటం మొదలు చివరి వరకూ తెలుగుదేశంలోనే కొనసాగారు. తెలంగాణలో టీడీపీ కనుమరుగవుతుందని పార్టీలు మారిన నేతలు ఉన్నారు.

Former MLA Kothakota Dayakar Reddy Passed away
మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కొత్తకోట దయాకర్ రెడ్డి(Kothakota Dayakar Reddy) కన్నుమూశారు. మహబూబ్నగర్(Mahbubnagar) జిల్లా రాజకీయాలలో కొత్తకోట దయాకర్ రెడ్డి తనదైన ముద్ర వేశారు. రాజకీయ ఆరంగ్రేటం మొదలు చివరి వరకూ తెలుగుదేశంలోనే కొనసాగారు. తెలంగాణలో టీడీపీ(TDP) కనుమరుగవుతుందని పార్టీలు మారిన నేతలు ఉన్నారు. కానీ దయాకర్ రెడ్డి తుదిశ్వాస విడిచేవరకూ తెలుగుదేశం(Telugu desham)లోనే కొనసాగారు. దయాకర్ రెడ్డి సతీమణి సీతాదయాకర్ రెడ్డి(Sita Dayakar Reddy) కూడా ఎమ్మెల్యేగా పనిచేశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్(Hyderabad)లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం కన్నుమూశారు. దయాకర్ రెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
