గద్దర్ చనిపోయే ముందు ఇచ్చిన హామీని మనమంతా నెరవేర్చాలి .. టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని మాజీమంత్రి షబ్బీర్ అలీ అన్నారు. సీఎం కేసీఆర్ గజ్వేల్, హైదరాబాద్‌ను అమ్మేశారని, ఇప్పుడు కామారెడ్డిని అమ్ముకునేందుకు ఇక్కడికి వస్తున్నారని..

Former Minister Shabbir Ali’s Comments on KCR
గద్దర్(Gaddar) చనిపోయే ముందు ఇచ్చిన హామీని మనమంతా నెరవేర్చాలి .. టీఆర్‌ఎస్(TRS) ప్రభుత్వాన్ని గద్దె దించాలని మాజీమంత్రి షబ్బీర్ అలీ(Shabbir Ali) అన్నారు. సీఎం కేసీఆర్(CM KCR) గజ్వేల్(Gajwel), హైదరాబాద్(Hyderabad)ను అమ్మేశారని, ఇప్పుడు కామారెడ్డి(Kamareddy)ని అమ్ముకునేందుకు ఇక్కడికి వస్తున్నారని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కామారెడ్డికి రింగురోడ్డు(Ring Road) వేస్తానని కేసీఆర్ చెబుతున్నారని.. ఇది కేవలం భూములను అమ్ముకోవడానికి వేసిన ఎత్తుగడ మాత్రమేనని అన్నారు. తెలంగాణ(Telangana) ఇచ్చింది కాంగ్రెస్(Congress) ప్రభుత్వమేనని మర్చిపోవద్దని సూచించారు.
సీఎం కేసీఆర్ వీధి వీధికి మద్యం దుకాణాల(Liquore Shops)ను తెరుస్తున్నారని ఆరోపించారు. మంత్రి కేటీఆర్(Minister KTR) రాష్ట్రంలో ఇసుక మాఫియా(Sand Mafia)ను నడిపిస్తున్నారన్నారు. రాష్ట్రంలో లిక్కర్ క్వీన్(Liquore Queen)గా ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) కొనసాగుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 10,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్‌తో రాష్ట్రాన్ని విడిచిపెట్టాం. కానీ కేసీఆర్ మాత్రం ఐదున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని అన్నారు.
రాష్ట్రాభివృద్ధికి కేసీఆర్ ఏం చేశారని మీ అందరినీ అడుగుతున్నాను. వాగ్దానాలు మాత్రమే చేసి అమలు చేయడంలో విఫలమయ్యారని అన్నారు. కేసీఆర్‌ను అధికారం నుంచి తప్పించి మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు.
