Sambani resigned from Congress : కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ మంత్రి సంభాని
ప్రచార జోరుమీదున్న కాంగ్రెస్‌కు(congress) ఖమ్మం(Khammam) జిల్లాలో గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత సంభాని చంద్రశేఖర్(Sambani Chandra shekar) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా(Resign) చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి(Revanth Reddy) పంపారు.

Sambani resigned from Congress
ప్రచార జోరుమీదున్న కాంగ్రెస్‌కు(congress) ఖమ్మం(Khammam) జిల్లాలో గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి, పార్టీ సీనియర్ నేత సంభాని చంద్రశేఖర్(Sambani Chandra shekar) పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా(Resign) చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆయన తన రాజీనామా లేఖను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి(Revanth Reddy) పంపారు. రాజీనామా లేఖలో.. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కాలం పార్టీలో నీతి, నిజాయితీ, నిబద్దత కొనసాగిన నేను.. ఇటీవల జరుగుతున్న అవమాన ఘటనలకు అత్యంత బాధతో పార్టీకి రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. సంభాని సీఎం కేసీఆర్(KCR) సమక్షంలో నేడు బీఆర్ఎస్‌లో(BRS) చేరనున్నారు. నిన్న నామా నాగేశ్వరరావు కూడా సంభానితో భేటీ అయ్యారు.
ఇదిలావుంటే.. సంభాని పాలేరు నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. రెండుసార్లు మంత్రిగా కూడా పనిచేశారు . 1989 నుండి 1994 వరకు, 2004 నుండి 2009 వరకు ఆరోగ్య మరియు వైద్య శాఖ మంత్రిగా పనిచేశారు.
