తెలంగాణ ఉద్యమంలో(telangana) డీఎస్పీ పదవిని తృణప్రాయంగా వదిలేసిన నళిని(Nalini) గుర్తున్నారు కదా!

తెలంగాణ ఉద్యమంలో(telangana) డీఎస్పీ పదవిని తృణప్రాయంగా వదిలేసిన నళిని(Nalini) గుర్తున్నారు కదా! ఆమె ఇప్పుడు మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై(CM Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు. నెల రోజులలో తన పిటిషన్‌పై ఎంక్వైరీ పూర్తి చేస్తారని అనుకున్నానని, ఏడు నెలలు దాటినా ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదని ఆమె అన్నారు. అసలు తన రెండు అప్లికేషన్‌లు టేబుల్‌ మీద ఉన్నాయా? లేక చెత్త బుట్టలో వేశారా? అన్న సందేహం కలుగుతోందని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి సార్‌ బాధ్యతలు చేపట్టగానే తనను గుర్తు చేశారని, ఇప్పుడేమో సప్పుడు చేయడం లేదని ఫైరయ్యారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో కూడా తన ఊసు ఎత్తలేదని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే సీఎం రేవంత్‌రెడ్డి నళినిని పిలిపించుకుని మాట్లాడారు. ఆమెకు తిరిగి డీఎస్పీ ఉద్యోగం ఎందుకు ఇవ్వకూడదనే అంశంపై ఆరా తీశారు. పోలీసు ఉద్యోగం కుదరకపోతే అదే స్థాయిలో మంచి ఉద్యోగాన్ని ఇవ్వాలని పోలీసులకు సూచించారు. ఈ విషయంలో నళినితో మాట్లాడని అధికారులకు సూచించారు. నళిని కూడా ఆధ్యాత్మిక ప్రచారానికి సాయంతో పాటు తన సర్వీస్‌ అంశానికి సంబంధించిన లేఖలను ముఖ్యమంత్రికి ఇచ్చారు. ఈ రెండు లేఖలపై ఇప్పటివరకూ పురోగతి లేకపోవడంతో ఆమె సోషల్‌మీడియా వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.

Eha Tv

Eha Tv

Next Story