ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత పరిగి శాసన సభ్యుడు మహేష్ రెడ్డి తండ్రి కొప్పుల హరీశ్వర్ రెడ్డి కన్నుమూశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత పరిగి(Parigi) శాసన సభ్యుడు మహేష్ రెడ్డి(Mahesh Reddy) తండ్రి కొప్పుల హరీశ్వర్ రెడ్డి(Koppula Harishwar Reddy) కన్నుమూశారు. అనారోగ్యంతో హరీశ్వర్ రెడ్డి తుది శ్వాస విడిచినట్లు తెలుస్తుంది. హరీశ్వర్ రెడ్డి గత కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని ఆయన కుటుంబీకులు చెబుతున్నారు. హరీశ్వర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ గా పని చేశారు. తెలుగుదేశం పార్టీ(Telugudesham Party)లో పోలిట్ బ్యూరో సభ్యుడిగా.. 25 సంవత్సరాలు పరిగి ఎమ్మెల్యేగా హరీశ్వర్ రెడ్డి సేవలందించారు. తెలంగాణ ఆవిర్భావం అనంతరం హరీశ్వర్ రెడ్డి 2014లో టీఆర్ఎస్ పార్టీ(TRS Party)లో జాయిన్ అయ్యారు. హరీశ్వర్ రెడ్డి మరణవార్త విన్న ఆయన అభిమానులు, బీఆర్ఎస్ కార్యకర్తలు శోకసంద్రంలో మునిగిపోయారు.
హరీశ్వర్‌రెడ్డి మృతి పట్ల సీఎం కేసీఆర్(CM KCR) సంతాపం తెలిపారు. ప్రజలకు హరీశ్వర్‌రెడ్డి చేసిన సేవలను సీఎం గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. హరీశ్వర్ రెడ్డి అకాల మరణం పట్ల టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(Revanth Reddy) సంతాపం ప్రకటించారు.