బీఆర్‌ఎస్‌(BRS) అధినేత, ప్రతిపక్ష నేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌(KCR) ఇల్లు మారనున్నట్లు(Relocate) తెలుస్తోంది. తనకు సెంటిమెంట్‌గా ఉన్న నందినగర్‌(Nandinagar) ఇంటిని వదులుకోవడం ఆయనకు ఇష్టం లేనప్పటికీ.. ఇల్లు మారాల్సిన తప్పని పరిస్థితి నెలకొంది. రోజు వచ్చి పోయే వాహనాలు, పార్టీ నేతలు, కార్యకర్తలతో బంజరాహిల్స్‎లోని నందినగర్ కాలనీలో ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి.

బీఆర్‌ఎస్‌(BRS) అధినేత, ప్రతిపక్ష నేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్‌(KCR) ఇల్లు మారనున్నట్లు(Relocate) తెలుస్తోంది. తనకు సెంటిమెంట్‌గా ఉన్న నందినగర్‌(Nandinagar) ఇంటిని వదులుకోవడం ఆయనకు ఇష్టం లేనప్పటికీ.. ఇల్లు మారాల్సిన తప్పని పరిస్థితి నెలకొంది. రోజు వచ్చి పోయే వాహనాలు, పార్టీ నేతలు, కార్యకర్తలతో బంజరాహిల్స్‎లోని నందినగర్ కాలనీలో ట్రాఫిక్ జామ్‌లు అవుతున్నాయి. ఇదే విషయాన్ని అటు పోలీసుశాఖ, ఇటు ప్రజలు కేటీఆర్‌(KTR) దృష్టికి తీసుకొచ్చారట. కేసీఆర్‌ ప్రస్తుతం ఉన్న ఇల్లు కూడా ఇరుకుగా ఉండడం.. చిన్నచిన్న సమావేశాలకు సరైన స్పేస్‌ లేకపోవడంతో కూడా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ ఇంటి నుంచే తాను ఉద్యమం చేసి సీఎం అయ్యానన్న సెంటిమెంట్‌ కూడా కేసీఆర్‌కు ఉండడంతో ఆ ఇల్లును వదులుకోడానికి అయిష్టంగా ఉన్నారట. అయితే ప్రస్తుతం ఆయన ఇంటి పక్కనే మరో ఇల్లు అమ్మకానికి ఉండడంతో దానిని కొన్నారు. దీంతో ఈ రెండు ఇళ్లను కలిపి ఒక పెద్ద ఇంటిని నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నారట. అందుకు ఒకటి, రెండేళ్లు పట్టే అవకాశం ఉన్నందున అతను మరో ఇంటికి షిఫ్ట్ అవుదామని భావిస్తున్నారు.

ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్‌కు ప్రొటోకాల్ ప్రకారం ప్రభుత్వ భవనాన్ని కేటాయించే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే కుందన్‌బాగ్‌లోని ప్రభుత్వ క్వార్టర్స్‌ను కేసీఆర్‌ పరిశీలించారని తెలుస్తోంది. మంత్రిగా ఉన్నప్పుడు జానారెడ్డి నివాసుమున్న క్వార్టర్‌, స్పీకర్‌కు కేటాయించిన క్వార్టర్‌ను కూడా కేసీఆర్‌ పరిశీలించారట. కార్యకర్తలు, నేతల తాకిడితో ఆ ప్రాంతంలో ఇబ్బందులు తలెత్తకుండా ఉండే ఇల్లు కోసం అన్వేషిస్తున్నారట. చిన్నపాటి సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా ఇల్లును వెతుక్కుంటున్నారు. పార్లమెంట్‌ ఎన్నికల తర్వాత మరో ఇంటికి కేసీఆర్‌ మకాం మర్చే అవకాశం ఉంది.

Updated On 15 March 2024 1:49 AM GMT
Ehatv

Ehatv

Next Story